For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్ గడ్డపై దుమ్మురేపుతున్న సిరాజ్.. ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేదనే కసితో..!

Hyderabad Pacer Mohammed Siraj Picks Up 5-wickets On His County Debut

లండన్: టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ దుమ్మురేపుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పరిగనలోకి తీసుకంటలేరనో లేక ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయలేదనే కసితోనో తెలియదు కానీ.. అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. తనదైన పేస్, స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. పరిమిత ఓవర్ల సిరీస్‌లతో భారత జట్టు బిజిగా ఉండటంతో కౌంటీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్న సిరాజ్.. వార్‌విక్‌షైర్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. తన ఫస్ట్ కౌంటీ మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ఘనతను అందుకొని తాను ఎంతటి విలువైన బౌలర్‌నో ప్రపంచానికి చెప్పాడు. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ 24 ఓవర్లలో 6 మెయిడిన్లతో 82 పరుగులిచ్చి 5 వికెట్లు తీసాడు.

పాక్ బ్యాటర్ ఇమామ్ వుల్ హక్‌ని 5 పరుగులకే పెవిలియన్ చేర్చిన మహ్మద్ సిరాజ్, 12 పరుగులు చేసిన బార్లెట్, 60 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన లూయిస్ గ్రేగోరీ, 21 పరుగులు చేసిన డేవీని ఔట్ చేశాడు. వికెట్ కీపర్ జెమ్స్ రానిని డకౌట్ చేశాడు. మహ్మద్ సిరాజ్ ధాటికి సోమర్‌సెట్ టీమ్ 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన పాక్ బౌలర్ షాజిద్ ఖాన్ 64 బంతుల్లో 9 ఫోర్లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఇంగ్లండ్ బౌలర్ హెన్రీ బ్రూక్స్ 3 వికెట్లు పడగొట్టాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో రోబర్ట్ యేట్స్ డకౌట్, అలెక్స్ డేవిస్ 9 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది వార్‌విక్‌షైర్. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న భారత క్రికెటర్లలో చాలా మంది చక్కని ప్రదర్శన ఇచ్చారు. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 2లో సుసెక్స్ క్లబ్ తరుపున ఆడిన చతేశ్వర్ పూజారా 1000+ పరుగులు చేసి అదరగొట్టగా ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ కూడా తమ జట్ల తరుపున చక్కని ప్రదర్శన కనబరిచారు.

ఇక ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సిరాజ్‌ను ఎంపిక చేయాల్సిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఆసీస్‌లో పేస్ బౌన్సీ పిచ్‌లుంటాయని, సిరాజ్ బౌలింగ్ సరిగ్గా సరిపోతుందని, 2021 ఆస్ట్రేలియా పర్యటనలో సిరాజ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడని గుర్తు చేస్తున్నారు.

Story first published: Tuesday, September 13, 2022, 20:55 [IST]
Other articles published on Sep 13, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+