Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

TG20 2026 ఛాంపియన్‌గా హైదరాబాద్.. కోటి నజరానా!

టీజీ20 లీగ్ 2026 అరంగేట్ర సీజన్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌ విజేతగా నిలిచింది. ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిరథ్ రెడ్డి(30 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 48), వైష్ణవ్ రెడ్డి(28 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 41 నాటౌట్), షణ్ముఖ అశ్విన్(21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

అంతకుముందు ఖమ్మం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. హిమతేజ(31) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. యశ్వీర్ గౌడ్(3/17), దేవ్ మెహతా(2/25), అజయ్ దేవ్ గౌడ్(2/36) ఖమ్మం పతనాన్ని శాసించారు.

Hyderabad E-Champions Crowned Inaugural TG20 2026 Champions After Defeating Khammam Aces by 6 wickets

రూ. కోటి నజరానా..

విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) రూ. కోటీ రూపాయల ప్రైజ్‌మనీని అందజేసింది. రన్నరప్ ఖమ్మం రూ.50 లక్షలు అందుకుంది. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా విజేతలకు బహుమతులు అందజేయగా.. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క్, డీజీపీ సీవీ ఆనంద్, టీజీ20 బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ అతిథులుగా హాజరయ్యారు. ఈ టోర్నీలో మొత్తం 10 శతకాలు నమోదవ్వగా.. 52 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. 592 సిక్సర్లు బాదారు.

అవార్డ్ విన్నర్స్..

అభిరథ్ రెడ్డి: ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ, ఆరెంజ్ క్యాప్(549 రన్స్), సూపర్ ఫోర్లు(58), సూపర్ సిక్సర్లు(33)

పర్పుల్ క్యాప్: అజయ్ దేవ గౌడ్(21)

ఇంపాక్ట్ ప్లేయర్: గణేశ్ గడుగు

అత్యధిక సెంచరీలు: తన్మయ్ అగర్వాల్(కరీంనగర్ డైమండ్స్)

బెస్ట్ క్యాచ్: మికిల్ జైస్వాల్(ఖమ్మం ఏసెస్)

ఎమర్జింగ్ ప్లేయర్: వేద్ రెడ్డి(15 వికెట్లు, ఖమ్మం)

సూపర్ స్ట్రైకర్: అమన్‌రావు(245.45, వరంగల్ వారియర్స్)

ఇంక్రెడిబుల్ మొమెంట్: మికిల్ జైస్వాల్(ఖమ్మం)

గేమ్ ఛేంజర్ ఆఫ్ ద టోర్నీ: హిమతేజ(ఖమ్మం)

Story first published: Monday, July 13, 2026, 9:37 [IST]
Other articles published on Jul 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+