Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా 9 మందితోనే ఆడుతోంది.. సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా దారుణ ప్రదర్శనపై హైదరాబాద్ పొలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా 9 మంది ఆటగాళ్లతోనే ఆడుతోందని, అందుకే ఘోర పరాజయాలు ఎదురువుతున్నాయని ఎక్స్‌వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల పేరు ప్రస్తావించకుండా వారిపై విమర్శలు గుప్పించారు.

సీవీ ఆనంద్ మంచి క్రికెటర్ అనే విషయం తెలిసిందే. ఆయన కుమారుడు హైదరాబాద్ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నారు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలో తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత రోహిత్ కెప్టెన్సీలో రెండు మ్యాచ్‌ల్లో ఓడి మరో మ్యాచ్ డ్రా చేసుకుంది. దాంతో నాలుగు టెస్ట్‌లు ముగిసే సరికి ఆసీస్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్ట్ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది.

Hyderabad CP CV Anand Says India is playing with only 9 players for a long time After Melbourne Test loss

మెల్ బోర్న్ టెస్ట్‌లో టీమిండియాకు ఎదురైన ఘోర పరాజయంపై ఓ నెటిజన్.. హైదరాబాద్ సీపీగా అభిప్రాయం చెప్పాలని కోరాడు. దానికి ఆయన తనదైన శైలిలో బదులిచ్చారు. 'ప్రత్యర్థి జట్టు 11 మందితో ఆడితే టీమిండియా మాత్రం 9 మందితోనే ఆడుతోంది. టాప్ టీమ్స్‌తో చిత్తుగా ఓడుతున్నాం. ఈ విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. గత ఆసీస్ పర్యటనలో కుర్రాళ్లతో టీమిండియా విజయం సాధించింది. ఇద్దరు టాప్ ప్లేయర్లు. వారు ఎవరో చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వారి సోషల్ మీడియా ఆర్మీలు నాపై ట్రోలింగ్‌కు దిగుతాయి. వారు అలా వెళ్లి ఇలా ఔటవుతున్నారు. స్టార్ ఆటగాళ్లు అవసరమైనప్పుడు మంచి ప్రదర్శన చేసి అభిమానుల్లో తమ ఆదరణ తగ్గకుండా ఆడాలి' సీవీ ఆనంద్ బదులిచ్చారు.

Story first published: Tuesday, December 31, 2024, 18:52 [IST]
Other articles published on Dec 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+