For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇలా తయారయ్యారేంట్రా.. ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ ఓవరాక్షన్‌పై సీవీ ఆనంద్ ఫైర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజయం తర్వాత అర్థరాత్రి హైదరాబాద్‌లో జరిగిన సెలెబ్రేషన్స్‌పై నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌సీబీ విజయంతో హైదరాబాద్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోని తొక్కిసలాట ఘటన గురించి ప్రస్తావిస్తూ.. హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటే బాధ్యులు ఎవరు? అని అసహనం వ్యక్తం చేశారు. సమాజం ఎటు వెళ్తుందని ఫ్యాన్స్ ఓవరాక్షన్‌పై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు. హైదరాబాద్ రోడ్లపై ఆర్‌సీబీ ఫ్యాన్స్ చేసిన ఓవరాక్షన్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేశారు.

Hyderabad Commissioner CV Anand Slams RCB Victory Celebrations in City

'బెంగళూరులో జరిగిన తొక్కిసలాట గురించి చూసినప్పుడు.. దాని గురించి విన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామా? అని ఆశ్చర్యం కలిగింది. ఇది ప్రపంచ కప్ గెలిచిన జాతీయ జట్టు కాదు. ఇది కేవలం వాణిజ్యపరంగా పనిచేసే ఆర్‌‌సీబీ అనే ఫ్రాంచైజీ సాధించిన విజయం. ఆ జట్టులో ఒక్క హైదరాబాద్ ఆటగాడు కూడా లేడు. ఇది హైదరాబాద్ బేస్డ్ ఫ్రాంచైజీ కూడా కాదు. అయినా ఆ జట్టు విజయం తర్వాత అర్థరాత్రి 12 గంటలకు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్‌లపైకి భారీ సంఖ్యలో యువకులు రావడం, ఆనందోత్సాహలతో సంబరాలు చేసుకోవడం చూసి రాత్రిపూట విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఈ ట్వీట్ కింద చూడవచ్చు.

ఇది చాలా ఆందోళనకరమైన విషయం. అభిమానుల అత్యుత్సాహం వల్ల ఆ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. అభిమానుల ఓవరాక్షన్, గూండాయిజంను చూసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను మోహరించాల్సి వచ్చింది. అల్లరి మూకను చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. ఓ పోలీస్ అధికారిగా చెబుతున్నా.. పెద్ద సంఖ్యలో గుమిగూడి రోడ్లపై వేడుకలు చేసుకోవం జనాల భద్రతకు పెద్ద ప్రమాదం. బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనకు దారితీయవచ్చు.

హైదరాబాద్‌లో కూడా ఎవరైన చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? అసలు ఆర్‌సీబీ విజయాన్ని హైదరాబాద్‌లో సెలెబ్రేట్ చేసుకుంటారని ఊహించగలమా? ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో పోలీస్ అధికారులు ప్రతీ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఓ మానవుడికి ఇలా చేయడం సాధ్యమేనా-అని నేను ఆలోచిస్తున్నాను'అని సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు.

ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉండాలని సీవీ ఆనంద్ తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్ నగరంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆర్‌సీబీ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. 18 ఏళ్ల తర్వాత ఆర్‌సీబీ టైటిల్ అందుకోవడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఈ టైటిల్ గెలవడంతో అతనిపై ఉన్న అభిమానంతో ఆర్‌సీబీ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే కొందరు అత్యుత్సాహంతో హద్దులు ధాటి ప్రవర్తించారు.

Story first published: Friday, June 6, 2025, 9:27 [IST]
Other articles published on Jun 6, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+