For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తెలుగు రాష్ట్రాలకు బీసీసీఐ అన్యాయం..!

తెలుగు రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్స్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మరోసారి తీరని అన్యాయం చేసింది. టీమిండియాకు సంబంధంచిన 2024-25 హోమ్ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌లో ఒకే ఒక్క మ్యాచ్ కేటాయించింది. అది కూడా బంగ్లాదేశ్‌తో చివరి టీ20 మ్యాచ్‌కు హైదరాబాద్‌ను వేదికగా ఎంపిక చేసింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ జరగనుంది. మరోవైపు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌(ఏసీఏ)కు ఒక్క మ్యాచ్ ఇవ్వలేదు. వైజాగ్ వేదికగా ఒక్క మ్యాచ్‌ను కూడా షెడ్యూల్ చేయలేదు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 సమయంలోనూ తెలుగు రాష్ట్రాల పట్ల బీసీసీఐ ఇదే వివక్షను కొనసాగించింది. హైదరాబాద్ వేదికగా ఇతర దేశాల లీగ్ మ్యాచ్‌లను కేటాయించిన బీసీసీఐ.. వైజాగ్‌కు ఒక్క మ్యాచ్ ఇవ్వలేదు.

Hyderabad and Vizag s cricket fans in despair as no India matches scheduled in home season 2024-25

దాంతో తెలుగు రాష్ట్రాల అభిమానులు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు బీసీసీఐలో కీలక పాత్ర పోషించే వరకు ఇదే పరిస్థితిని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియా హోమ్ సీజన్ 2024-25‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2024 ఆడుతున్న టీమిండియా.. ఈ టోర్నీ అనంతరం జూలైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అనంతరం శ్రీలంక పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. సెప్టెంబర్ చివరి వారంలో భారత్‌కు బంగ్లాదేశ్ రానుండగా.. ఆ జట్టుతో రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు ఆడనుంది.

అనంతరం అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్, మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌తో భారత హోమ్ సీజన్ ముగియనుంది. ఆ తర్వాత ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది.

బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు

తొలి టెస్ట్: సెప్టెంబర్ 19 నుంచి 23, చెన్నై వేదికగా ఉదయం 9.30 గంటలకు

రెండో టెస్ట్: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1, కాన్పూర్ వేదికగా ఉదయం 9.30 గంటలకు

తొలి టీ20: అక్టోబర్ 6, ధర్మశాల, రాత్రి 7 గంటలకు

రెండో టీ20: అక్టోబర్ 9, ఢిల్లీ, రాత్రి 7 గంటలకు

మూడో టీ20: అక్టోబర్ 12, హైదరాబాద్, రాత్రి 7 గంటలకు

న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్..

తొలి టెస్ట్: అక్టోబర్ 16-20, బెంగళూరు, ఉదయం 9.30 గంటలకు

రెండో టెస్ట్: అక్టోబర్24- 28, పుణే, ఉదయం 9.30 గంటలకు

మూడో టెస్ట్: నవంబర్ 1 నుంచి 5, ముంబై, ఉదయం 9.30 గంటలకు

ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు

తొలి టీ20: జనవరి 22, చెన్నై, రాత్రి 7 గంటలకు

రెండో టీ20: జనవరి 25, కోల్‌కతా, రాత్రి 7 గంటలకు

మూడో టీ20: జనవరి 28, రాజ్‌కోట్, రాత్రి 7 గంటలకు

నాలుగో టీ20: జనవరి 31, పుణే, రాత్రి 7 గంటలకు

ఐదో టీ20: ఫిబ్రవరి 2, ముంబై, రాత్రి 7 గంటలకు

వన్డే సిరీస్

తొలి వన్డే: ఫిబ్రవరి 6, నాగ్‌పూర్, మధ్యాహ్నం 1.30 గంటలకు

రెండో వన్డే: ఫిబ్రవరి 9, కటక్, మధ్యాహ్నం 1.30 గంటలకు

మూడో వన్డే: ఫిబ్రవరి 12, అహ్మదాబాద్, మధ్యాహ్నం 1.30 గంటలకు

Story first published: Thursday, June 20, 2024, 18:22 [IST]
Other articles published on Jun 20, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+