Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021 ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ!

Huge blow for Rajasthan Royals as Jofra Archer to miss first half of IPL 2021
IPL 2021 : Jofra Archer To Miss First Half of IPL 14 - ECB, Big blow For Rajasthan Royals | Oneindia

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీకి గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఇంగ్లండ్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్.. మోచేతి గాయం కారణంగా ఈ సీజన్ ఐపీఎల్ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. ఈ గాయం కారణంగానే భారత్‌తో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు ఆర్చర్ దూరమయ్యాడు. ఆర్చర్‌ను స్వదేశానికి రప్పిస్తున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

ఐపీఎల్ ఆడటం డౌట్

ఐపీఎల్ ఆడటం డౌట్

'ఆర్చర్ గాయాన్ని మెడికల్ టీమ్ అంచనా వేస్తుంది. దానిని బట్టే ట్రీమ్‌మెంట్, రిహాబిలిటేషన్, రీఎంట్రీ ఉంటుంది. అది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం. కాబట్టి ఐపీఎల్ స్టార్టింగ్ మ్యాచ్‌లకు ఆర్చర్ అందుబాటులో ఉండటం కష్టంగా మారింది'అని ఈసీబీ పేర్కొంది. ఈ ప్రకటనను బట్టి చూస్తే గాయం నయం కాకుంటే ఆర్చర్ ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన జోప్రా ఆర్చర్ 20 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.

మళ్లీ రావడం కష్టమే..

మళ్లీ రావడం కష్టమే..

ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ జరగనుండగా.. ఏప్రిల్ 4 నుంచే అన్ని ఫ్రాంఛైజీలు క్యాంప్‌లను ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ పరీక్షలు, క్వారంటైన్‌ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్ బయో- సెక్యూర్ బబుల్‌లోకి టీమ్‌లు వెళ్లనున్నాయి. దాంతో.. ఇప్పుడు గాయంతో స్వదేశానికి వెళ్లనున్న జోప్రా ఆర్చర్.. మళ్లీ ఐపీఎల్ 2021 సీజన్ కోసం భారత్‌కి రావడం అనుమానంగానే కనిపిస్తోంది.

రాజస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ..

రాజస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ..

ఐపీఎల్ 2018 నుంచి రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కి జోప్రా ఆర్చర్ ఆడుతున్నాడు. ఆ ఏడాది 15 వికెట్లు పడగొట్టిన ఆర్చర్.. 2019లో 11 వికెట్లు మాత్రమే తీశాడు. కానీ.. ఐపీఎల్ 2021 సీజన్‌లో అసాధారణరీతిలో ఆర్చర్ రాణించాడు. ఫస్ట్ పవర్‌ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీయగలిగే ఆర్చర్.. స్లాగ్ ఓవర్లలోనూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయగలడు. ఈ నేపథ్యంలో.. ఆర్చర్‌ లేకపోతే రాజస్థాన్ రాయల్స్‌ బౌలింగ్ విభాగం బలహీనపడనుంది. కనీసం ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలోనైనా ఆర్చర్ భారత్‌కి వస్తాడని రాజస్థాన్ ఆశిస్తోంది. కానీ.. క్లారిటీ మాత్రం ఈ పేసర్ ఇవ్వడం లేదు.

Story first published: Monday, March 22, 2021, 10:39 [IST]
Other articles published on Mar 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+