Asia Cup 2022: బుమ్రా లేడు.. కోహ్లీ ఫామ్‌లో లేడు.. రాహుల్ ఆడనే లేదు.. టీమిండియా ఏం గెలుస్తుందో ఏమో!

హైదరాబాద్: ఆసియా కప్ 2022 టోర్నీకి సమయం ఆసన్నమైంది. మరో 15 రోజుల్లో ఈ మినీ ప్రపంచకప్‌కు తెరలేవనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే దేశాలు తమ జట్లను ప్రకటించాయి. భారత్ సైతం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోనే 2018 ఆసియా కప్ టైటిల్ గెలిచిన భారత జట్టు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అతని నాయకత్వంలోనే బరిలోకి దిగనుంది. అప్పుడు జట్టు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ వివాహం కారణంగా ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. దాంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ జట్టును నడిపించి విజేతగా నిలబెట్టాడు.

బుమ్రా లేకపోవడం..
అయితే విరాట్ కోహ్లీ లేకపోయినా.. శిఖర్ ధావన్, ఎంఎస్ ధోనీ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి సీనియర్లతో బరిలోకి దిగిన రోహిత్ ఫలితాన్ని రాబట్టాడు. అయితే ఈసారి జస్‌ప్రీత్ బుమ్రా లేకుండానే టీమిండియా ఆసియా కప్ బరిలోకి దిగుతోంది. జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు టీ20 స్పెషలిస్ట్ పేసర్ హర్షల్ పటేల్ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమయ్యారు. పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో బుమ్రా లేని లోటు భారత్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు మహ్మద్ రిజ్వాన్ మంచి ఫామ్‌లో ఉండటం కూడా టీమిండియా అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

కలవరపెడుతున్న కోహ్లీ ఫామ్
దుబాయ్ వేదికగా ఆసియాకప్ జరగుతుండటంతో హర్షల్ పటేల్ కీలకమవుతాడని టీమ్‌మేనేజ్‌మెంట్ భావించింది. ఇక్కడే జరిగిన ఐపీఎల్ 2021 (సెకండాఫ్) సీజన్‌లో హర్షల్ పటేల్ 32 వికెట్లతో సత్తా చాటాడు. ముఖ్యంగా దుబాయ్ వంటి స్లో వికెట్లపై హర్షల్ స్మార్ట్‌గా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడతాడు. అలాగే ఆసియాకప్‌తో పాటు పాకిస్థాన్‌పై బీభత్సమైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. ఐసీసీ టోర్నీల్లో, ఆసియా కప్‌లో కోహ్లీ ఇప్పటి వరకు పాకిస్తాన్‌పై 5 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. 2021 టీ20 వరల్డ్ కప్‌లోనూ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ విఫలమైనా విరాట్ హాఫ్ సెంచరీతో రాణించి భారత్‌కు పోరాడే లక్ష్యాన్ని అందించిన విషయం తెలిసిందే.

కేఎల్ రాహుల్ ఏం ఆడుతాడో..
ఈ ఏడాది ఐపీఎల్‌లో దారుణంగా విఫలమైన కోహ్లీ.. ఇంగ్లండ్ టూర్‌లో ఓ టెస్టు, రెండు వన్డేలు, రెండు టీ20 మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. వెస్టిండీస్ పర్యటనకు దూరంగా విరాట్.. సుదీర్ఘ విరామం అనంతరం నేరుగా ఆసియాకప్ బరిలోకి దిగుతున్నాడు. ఓ కేఎల్ రాహుల్, ఈ ఏడాది ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. సౌతాఫ్రికా టూర్‌లో వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్, స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ముందు గాయపడ్డాడు.
ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత దాదాపు మూడు నెలలుగా విశ్రాంతి తీసుకుంటున్న కేఎల్ రాహుల్.. ఆసియాకప్‌తోనే నేరుగా బరిలోకి దిగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications