Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2025: మహిళల ఐపీఎల్.. ఫ్రీగా ఎలా చూడాలంటే?

మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ఈ ధనాధన్ లీగ్‌కు తెరలేవనుంది. గురువారం(ఫిబ్రవరి 14) జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి. వడోదర వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన ఆర్‌సీబీకి సారథ్యం వహిస్తుండగా.. ఆస్ట్రేలియా స్టార్ ఆష్లీ గార్డ్‌నర్ గుజరాత్ జెయింట్స్‌ను నడిపించనుంది.

టోర్నీ ఫార్మాట్..
డబ్ల్యూపీఎల్‌లో మొత్తం ఐదు జట్లు డబుల్ రాబిన్ ఫార్మాట్‌లో తలపడనున్నాయి. లీగ్ దశలో ప్రతీ జట్టు తమ ప్రత్యర్థితో రెండేసి మ్యాచ్‌లు ఆడుతాయి. పాయింట్స్‌ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన టీమ్ నేరుగా ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా.. రెండు, మూడో స్థానంలో నిలిచిన జల్లు ఎలిమినేటర్ ఆడుతాయి. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతోంది.

How To Watch WPL 2025 For Free broadcast channel and live streaming details

మొత్తం నాలుగు వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. వడోదరలోని కోటాంబి స్టేడియం, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, లక్నోలోని ఎకానా స్టేడియం, ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియం ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ఫ్రీగా ఎలా చూడాలంటే..?
డబ్ల్యూపీఎల్ 2025 సీజన్‌కు జియోసినిమా, స్పోర్ట్స్ 18 నెట్ వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్నాయి. స్పోర్ట్స్ 18 ఛానెల్ పాటు జియోసినిమాలో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్షప్రసారం కానున్నాయి. మొత్తం 8 భాషాల్లో కామెంట్రీ అందుబాటులో ఉండనుంది. జియోసినిమాలో ఈ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించవచ్చు. స్పోర్ట్స్ 18 ఛానెల్‌ను మాత్రం సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఐదు జట్ల వివరాలు..

1. ఆర్‌సీబీ
స్మృతి మంధాన(కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియో వేర్‌హమ్, శ్రేయంక పాటిల్, ఆషా శోభనా, సోఫీ డివైన్, రేణుకా, జోషిత(రూ. 10 లక్షలు,) రాఘవి బిస్త్(రూ. 10 లక్షలు), జాగ్రవి పవార్(రూ. 10 లక్షలు), ప్రేమ రావత్(రూ. 1.20 కోట్లు)

2. ముంబై ఇండియన్స్
అమంజోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, నాట్ స్కివర్-బ్రంట్, పూజా వస్త్రాకర్, సైకా ఇషాక్, యాస్తికా భాటియా, షబ్నిమ్ ఇస్మాయిల్, ఎస్ సజన, అమన్‌దీప్ కౌర్, కీర్తన బాలకృష్ణన్, జి కమలిని(రూ. 1.60 కోట్లు), నాడిన్ డి క్లర్క్(రూ. 30 లక్షలు), అక్షితా మహేశ్వరి(రూ. 20 లక్షలు), సంస్కృతి గుప్తా(రూ. 10 లక్షలు)

3. ఢిల్లీ క్యాపిటల్స్
అలిస్ క్యాప్సే, అరుంధతి రెడ్డి, జెమిమా రోడ్రిగ్స్, జెస్ జోనాస్సెన్, మారిజానే కప్ప్, మెగ్ లానింగ్, మిన్ను మణి, రాధా యాదవ్, షఫాలీ వర్మ, శిఖా పాండే, స్నేహ దీప్తి, తానియా భాటియా, టిటాస్ సాధు, అన్నాబెల్ సదర్లాండ్, ఎన్. చరణి(రూ. 55 లక్షలు), నందిని కశ్యప్(రూ. 10 లక్షలు), సారా బ్రైస్(రూ. 10 లక్షలు), నికి ప్రసాద్(రూ.10 లక్షలు)

4.యూపీ వారియర్స్
అలిస్సా హీలీ, అంజలి సర్వాణి, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, చమరి అతపత్తు, రాజేశ్వరి గయాక్‌వాడ్, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, బృందా దినేష్, పూనమ్ ఖేమ్నార్, సైమా థాకనా, సైమా థాకనా, అలానా కింగ్(రూ. 30 లక్షలు), అరుషి గోయెల్(రూ. 10 లక్షలు), క్రాంతి గౌడ్(రూ. 10 లక్షలు)

5. గుజరాత్ జెయింట్స్
ఆష్లీ గార్డనర్, బెత్ మూనీ, దయాళన్ హేమలత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకీల్, తనూజా కన్వర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, మేఘనా సింగ్, కష్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, మన్నత్ కశ్యప్, సయాలీ సత్‌గారే, సిమ్రాన్ షేక్(రూ. 1.90 కోట్లు), డియాండ్రా డాటిన్(రూ. 1.70 కోట్లు), డేనియల్ గిబ్సన్(రూ. 30 లక్షలు), ప్రకాశిక నాయక్(రూ. 10 లక్షలు)

Story first published: Thursday, February 13, 2025, 17:53 [IST]
Other articles published on Feb 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+