Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రివేంజ్‌ ఫైట్‌కు వైభశ్ సూర్యవంశీ రెడీ.. ఎలా చూడాలంటే..?

శ్రీలంక పర్యటనలో భారత్-ఏ ఆఖరి పోరుకు సిద్దమైంది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆదివారం శ్రీలంక ఏతో దంబుల్లా వేదికగా జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. సాధారణంగా భారత్-ఏ మ్యాచ్‌లను పెద్దగా పట్టించుకోరు. కానీ టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగడంతో ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.

అంతేకాకుండా శ్రీలంక-ఏతో జరిగిన గత మ్యాచ్‌లో భారత్-ఏ సూపర్ ఓవర్‌లో ఓటమిపాలవ్వడం, ప్రత్యర్థి ఆటగాళ్లను వైభవ్ నెట్టేయడం ఫైనల్ మ్యాచ్‌పై ఆసక్తిని రెట్టింపు చేసింది. వైభవ్‌ను శ్రీలంక ఆటగాళ్లు ఎగతాళి చేయడం భారత అభిమానులకు నచ్చలేదు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి శ్రీలంక ఆటగాళ్లకు వైభవ్ బుద్ది చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

శ్రీలంక-ఏకు దబిడి దిబిడే

అయితే ఈ ముక్కోణపు సిరీస్‌లో వైభవ్ ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. దాంతో అతనికి కూడా ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. వైభవ్ సూర్యవంశీ క్రీజులో ఉంటే ఎంత ప్రమాదమో ఐపీఎల్‌లో చూశాం. ఇప్పుడు అతన్ని శ్రీలంక ఆటగాళ్లు కవ్వించారు. అలసే కీలక మ్యాచ్‌ల్లో దూకుడుగా ఆడే తత్వం వైభవ్‌ది. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో భారీ శతకంతో చెలరేగిన వైభవ్.. శ్రీలంక-ఏతో కూడా చెలరేగుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

How to watch Vaibhav Sooryavanshi in India A vs Sri Lanka A Final TV Channel Start Time

ఎలా చూడాలంటే..?

భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌కు సోనీ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. సోనీ టెన్ ఛానెల్స్‌తో పాటు సోనీలివ్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ మ్యాచ్‌‌ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. అయితే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీగా చూసే వెసులు బాటు అయితే లేదు.

వైభవ్‌ను టార్గెట్ చేయం..

ఫైనల్‌కు ముందు మీడియాతో మాట్లాడిన శ్రీలంక-ఏ కెప్టెన్ సహాన్ అరాచిగే.. వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేయమని తెలిపాడు. 'మా వాళ్లు ఎవరినీ, ఏ విషయాన్ని కూడా ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోరు. మేం ఆటను మాత్రమే ఆస్వాదిస్తాం. సూపర్‌ ఓవర్‌ లాంటి సందర్భాల్లో ఆటగాళ్లు భావోద్వేగాలకు లోనుకావడం సహజం. ఆటలో ఇలాంటి ఘటనలు సాధారణమే. భారత్‌తో ఫైనల్‌కు మేం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాం.

బ్యాటింగ్‌ విషయంలో మాకు ఎలాంటి సమస్య లేదు. మా బౌలింగ్ విభాగం కూడా బాగానే రాణిస్తుంది. ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.'అని అరాచిగే చెప్పుకొచ్చాడు. కాగా లీగ్‌ దశలో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా చెరొకటి గెలిచాయి. తొలుత శ్రీలంకపై భారత్‌ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కగా.. రెండో మ్యాచ్‌లో లంక సూపర్‌ ఓవర్లో విజయం సాధించింది. ఇక ఇరుజట్లు అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టాయి.

Story first published: Saturday, June 20, 2026, 17:18 [IST]
Other articles published on Jun 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+