Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia టీ20 సిరీస్.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కోల్పోయిన టీమిండియా ఐదు టీ20ల సిరీస్ కోసం సిద్దమైంది. బుధవారం కాన్‌బెర్రా వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే టీమిండియా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గతేడాదిగా టీ20ల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా.. ఆసీస్ గడ్డపై అదే జోరును కొనసాగించాలనుకుంటుంది. మరోవైపు వరల్డ్ ఛాంపియన్ ఇండియాను టీ20 సిరీస్‌లో కూడా ఓడించి సత్తా చాటాలని ఆసీస్ భావిస్తోంది. దాంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఫ్రీగా ఎలా చూడాలంటే..?

ఈ ఐదు టీ20ల సిరీస్‌కు స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ వ్యవహరిస్తున్నాయి. అయితే ఈ రెండు వేదికల్లో మ్యాచ్‌లు చూడాలంటే డబ్బులు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. జియో మొబైల్ యూజర్లు మాత్రం ప్రత్యేక రిఛార్జి ప్లాన్స్‌తో జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. ఈ మ్యాచ్‌లు దూరదర్శన్(డీడీ) స్పోర్ట్స్ ఛానెల్‌లో ఉచితంగా ప్రసారం కానున్నాయి. కానీ కేబుల్, డీటీహెచ్ సర్వీసుల్లో మాత్రం ఫ్రీగా రాదు. terrestrial network(భూ ఆదారిత నెట్ వర్క్) కనెక్షన్లలో మాత్రమే డీడీ స్పోర్ట్స్‌ ఫ్రీగా రానుంది.

How to Watch the India vs Australia T20I Series for Free

ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత టీ20 జట్టు:

సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ(కీపర్), వరుణ్ చక్రవర్తీ, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్(కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.

టీ20 షెడ్యూల్..

తొలి టీ20: అక్టోబర్ 29(బుధవారం),కాన్‌బెర్రా, మధ్యాహ్నం 1.45 గంటలకు

రెండో టీ20: అక్టోబర్ 31(శుక్రవారం), మెల్‌బోర్న్, మధ్యాహ్నం 1.45 గంటలకు

మూడో టీ20: నవంబర్ 2(ఆదివారం), హోబర్ట్ , మధ్యాహ్నం 1.45 గంటలకు

నాలుగో టీ20: నవంబర్ 6(గురువారం), గోల్డ్ కోస్ట్ , మధ్యాహ్నం 1.45 గంటలకు

ఐదో టీ20: నవంబర్ 8(శనివారం), బ్రిస్బేన్, మధ్యాహ్నం 1.45 గంటలకు

Story first published: Tuesday, October 28, 2025, 16:18 [IST]
Other articles published on Oct 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+