Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia వన్డే సిరీస్.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?

వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా 24 గంటల వ్యవవధిలోనే ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరింది. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్లు బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కాయి.

ముందుగా వన్డే సిరీస్ జరగనుండగా.. అక్టోబర్ 19న పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. టీమిండియా వెటరన్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా జట్టుతో కలిసి ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కారు. ఈ సిరీస్‌లో టీమిండియాను శుభ్‌మన్ గిల్ నడిపించనుండగా.. కోహ్లీ, రోహిత్‌లు అతని సారథ్యంలో ఆడనున్నారు.

How to Watch the India vs Australia ODI Series for Free

నాలుగు నెలల తర్వాత

ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత కోహ్లీ, రోహిత్ మైదానంలోకి బరిలోకి దిగుతుండటం ఇదే తొలిసారి కావడంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ, రోహిత్‌లకు ఈ సిరీస్ కీలకం కానుంది. ఈ మూడు వన్డే మ్యాచ్‌ల్లో కనబర్చే ప్రదర్శనపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ సిరీస్‌లో విఫలమైతే వారికి వారే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం కూడా ఉందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

ఫ్రీగా ఎలా చూడాలంటే..?

ఈ సిరీస్‌కు స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ వ్యవహరిస్తున్నాయి. అయితే ఈ రెండు వేదికల్లో మ్యాచ్‌లు చూడాలంటే డబ్బులు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. జియో మొబైల్ యూజర్లు మాత్రం ప్రత్యేక రిఛార్జి ప్లాన్స్‌తో జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. ఈ మ్యాచ్‌లు దూరదర్శన్(డీడీ) స్పోర్ట్స్ ఛానెల్‌లో ఉచితంగా ప్రసారం కానున్నాయి. కానీ కేబుల్, డీటీహెచ్ సర్వీసుల్లో మాత్రం ఫ్రీగా రాదు. terrestrial network(భూ ఆదారిత నెట్ వర్క్) కనెక్షన్లలో మాత్రమే డీడీ స్పోర్ట్స్ ఫ్రీగా రానుంది.


ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత వన్డే జట్టు:

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.

వన్డే షెడ్యూల్..

తొలి వన్డే: అక్టోబర్ 19(ఆదివారం),పెర్త్, ఉదయం 9 గంటలకు
రెండో వన్డే: అక్టోబర్ 23(గురువారం), అడిలైడ్, ఉదయం 9 గంటలకు
మూడో వన్డే: అక్టోబర్ 25(శనివారం), సిడ్నీ , ఉదయం 9 గంటలకు

ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత టీ20 జట్టు:

సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ(కీపర్), వరుణ్ చక్రవర్తీ, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్(కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.

టీ20 షెడ్యూల్..

తొలి టీ20: అక్టోబర్ 29(బుధవారం),కాన్‌బెర్రా, మధ్యాహ్నం 1.45 గంటలకు

రెండో టీ20: అక్టోబర్ 31(శుక్రవారం), మెల్‌బోర్న్, మధ్యాహ్నం 1.45 గంటలకు

మూడో టీ20: నవంబర్ 2(ఆదివారం), హోబర్ట్ , మధ్యాహ్నం 1.45 గంటలకు

నాలుగో టీ20: నవంబర్ 6(గురువారం), గోల్డ్ కోస్ట్ , మధ్యాహ్నం 1.45 గంటలకు

ఐదో టీ20: నవంబర్ 8(శనివారం), బ్రిస్బేన్, మధ్యాహ్నం 1.45 గంటలకు

Story first published: Thursday, October 16, 2025, 6:05 [IST]
Other articles published on Oct 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+