Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA20 ఫైనల్లో సన్‌రైజర్స్ X ముంబై ఇండియన్స్.. ఫ్రీగా ఎలా చూడాలంటే?

సౌతాఫ్రికా 20 లీగ్ తుది దశకు చేరింది. నేడు(శనివారం) జరిగే ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ తలపడనున్నాయి. వరుసగా రెండు సార్లు విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ మూడో టైటిల్‌పై కన్నేసింది. మరోవైపు అసాధారణ ప్రదర్శనతో టేబుల్ టాపర్‌గా నిలిచిన ముంబై కేప్‌టౌన్.. అదే జోరులో సన్‌రైజర్స్‌ను ఓడించి తొలి టైటిల్‌ను ముద్దాడాలనే పట్టుదలతో ఉంది.

ఓటమితో ఈ టోర్నీని ప్రారంభించిన సన్‌రైజర్స్ పడుతూ లేస్తూనే తన ప్రయాణాన్ని ముందుకు సాగించింది. కీలక మ్యాచ్‌‌లు గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకున్న సన్‌రైజర్స్.. అసాధారణ ప్రదర్శనతో ఎలిమినేటర్‌తో పాటు క్వాలిఫయర్-2 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది.

How To Watch SA20 League 2025 Final fixture of MI Cape Town Vs Sunrisers Eastern Cape

వరుస విజయాలతో..
ఎలిమినేటర్ మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌ను ఓడించిన సన్‌రైజర్స్.. క్వాలిఫయర్-2లో పార్ల్ రాయల్స్‌ను చిత్తు చేసింది. మరోవైపు క్వాలిఫయర్-1లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్.. పార్ల్ రాయల్స్‌ను ఓడించి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. బలబలాల పరంగా ఇరు జట్లు సమంగా ఉన్నాయి. కానీ ముంబై‌కేప్‌టౌన్ కాస్త మెరుగ్గా ఉంది.

సన్‌రైజర్స ఈస్టర్న్ కేప్‌టౌన్‌లో కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్‌తో పాటు ఓపెనర్ టోన్నీ డీ జోర్జి ధనాధన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. మరోసారి ఈ ముగ్గురు సత్తాచాటితే సన్‌రైజర్స్ విజేతగా నిలవనుంది. మరోవైపు ముంబై జట్టులో ర్యాన్ రికెల్టన్, రాసీ వాన్ డెర్ డస్సెన్, డెవాల్డ్ బ్రెవిస్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. బౌలింగ్‌లో ఫర్చూన్, దునిత్ వెల్లలేగా రాణిస్తున్నారు.

ఫ్రీగా ఎలా చూడాలంటే..?
భారత కాలమానం ప్రకారం సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై ఫైనల్ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. సెంచూరియన్ వేదికగా ఈ టైటిల్ ఫైట్ జరగనుంది. ఈ పిచ్ బౌలర్లతో పాటు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. ఈ టోర్నీకి స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌తో పాటు డీస్నీ హాట్ స్టార్ యాప్‌లో ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. అయితే ఫ్రీగా చూసే వెసులుబాటు అయితే లేదు. సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీగా చూడాలంటే సంబంధిత నెట్ వర్క్‌ రిఛార్జ్ ప్లాన్స్‌‌తో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

Story first published: Saturday, February 8, 2025, 8:34 [IST]
Other articles published on Feb 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+