సౌతాఫ్రికా టీ20 ఫ్రాంచైజీ లీగ్ SA20లీగ్‌కు నేడే(గురవారం) తెరలేవనుంది. ఇప్పటికే రెండు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న SA20 మూడో సీజన్‌కు ముస్తాబైంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్‌లకు చెందిన జట్లు ఈ లీగ్‌లో పోటీపడుతున్నాయి.
డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ఎంఐ కేప్ టౌన్ జట్ల మధ్య కేప్‌టౌన్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8వరకు 6 జట్ల మధ్య 30 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

కావ్య పాప టీమ్‌తో షురూ..
కావ్య మారన్‌కు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ వరుసగా రెండు సీజన్లలో విజేతగా నిలిచింది. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దినేశ్ కార్తీక్.. ఈ లీగ్ బరిలోకి దిగుతున్నాడు. పార్ల్ రాయల్స్ జట్టుకు దినేశ్ కార్తీక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో ఆడుతున్న తొలి భారత ఆటగాడిగా దినేశ్ కార్తీక్ గుర్తింపు పొందనున్నాడు.
టైమింగ్స్ ఏంటంటే..?
భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లు సాయంత్రం 4.30 గంటలకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. డబుల్ హెడర్ ఉన్నప్పుడు తొలి మ్యాచ్ 4.30 గంటలకు ప్రారంభమైతే.. రెండో మ్యాచ్ రాత్రి 9 గంటలకు మొదలవుతోంది. ఒక్క మ్యాచే ఉంటే రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతోంది.
ఎలా చూడాలంటే..?
ఈ టోర్నీకి స్టార్ స్పోర్ట్స్-2, స్పోర్ట్స్ 18 -2 ఛానెల్స్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్నాయి. ఈ ఛానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు రానున్నాయి. అయితే హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు ఫ్రీగా చూసే అవకాశం లేదు.
జట్లు
1. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్
ఎయిడెన్ మార్‌రమ్ (కెప్టెన్), జాక్ క్రాలే, జోర్డాన్ హెర్మాన్, టామ్ అబెల్, లియామ్ డాసన్, మార్కో జాన్సెన్, పాట్రిక్ క్రుగర్, క్రెయిగ్ ఓవర్టన్, డేవిడ్ బెడింగ్‌హామ్, డేనియల్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, ఓకుహ్లే సెలే, సైమన్ హార్మర్, ఒట్నీల్ బార్ట్‌మన్, రిచర్డ్ గ్లీయోన్ , ఆండిలే సిమెలన్, బేయర్స్ స్వానెపోయెల్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే
2. MI కేప్ టౌన్
రషీద్ ఖాన్ (సి), కోలిన్ ఇంగ్రామ్, డెవాల్డ్ బ్రీవిస్, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, థామస్ కబెర్, జార్జ్ లిండే, డెలాగో, పోట్‌గీటర్, కార్బిన్ బాష్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కానర్ ఎస్టర్‌హుజెన్, క్రిస్ బెంజమిన్, ర్యాన్ రికెల్టన్, డాన్ రికెల్టన్, ట్రెంట్ బౌల్ట్ , కగిసో రబడ, నువాన్ తుషార
3. ప్రిటోరియా క్యాపిటల్స్
వేన్ పార్నెల్ (కెప్టెన్), మార్క్వెస్ అకెర్‌మాన్, ఎవిన్ లూయిస్, స్టీవ్ స్టోక్, టియాన్ వాన్ వురెన్, రిలీ రోసౌ, విల్ స్మీడ్, లియామ్ లివింగ్ స్టోన్, విల్ జాక్స్, సెనురాన్ ముత్తుసామి, జేమ్స్ నీషమ్, కైల్ సిమండ్స్, మిగేల్ రహ్మానియోనస్, కెహ్‌గాన్ బామానియన్ కైల్ వెర్రేన్నే, అన్రిచ్ నోర్ట్జే, డారిన్ డుపావిల్లోన్, ఈతాన్ బాష్.
4. జోబర్గ్ సూపర్ కింగ్స్
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), ల్యూస్ డి ప్లూయ్, ఇవాన్ జోన్స్, సిబోనెలో మఖాన్యా, మొయిన్ అలీ, విహాన్ లుబ్బే, డేవిడ్ వైస్, జెపి కింగ్, జానీ బెయిర్‌స్టో, డెవాన్ కాన్వే, డోనోవన్ ఫెరీరా, మతీషా పతిరానా, తబ్రైజ్ షమ్సీ, గెరాల్డ్ కోట్జీ, డగ్ బ్రేస్‌వెల్ బ్యూరాన్ హెండ్రిక్స్, ఇమ్రాన్ తాహిర్, మహేశ్ తీక్షణ, హర్డస్ విల్జోయెన్.
5. పార్ల్ రాయల్స్
డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), మిచెల్ వాన్ బ్యూరెన్, సామ్ హైన్, జో రూట్, దేవాన్ మరైస్, దయాన్ గాలియం, దునిత్ వెల్లలగే, కోడి యూసుఫ్, ఆండిలే ఫెహ్లుక్వాయో, రూబిన్ హెర్మాన్, దినేష్ కార్తీక్, లువాన్-డ్రే ప్రిటోరియస్, ముజీబ్ ఉర్ రెహమాన్, కీత్ డడ్జియన్ ఫోర్టుయిన్, ఎషాన్ మలింగ, క్వేనా మఫాకా, పీటర్, లుంగి ఎంగిడి
6. డర్బన్ యొక్క సూపర్ జెయింట్స్
కేశవ్ మహారాజ్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్, కేన్ విలియమ్సన్, జాసన్ స్మిత్, జెజె స్మట్స్, మార్కస్ స్టోయినిస్, క్రిస్టోఫర్ కింగ్, వియాన్ ముల్డర్, క్రిస్ వోక్స్, డ్వైన్ ప్రిటోరియస్, ప్రెనెలన్ సుబ్రేయన్, బ్రైస్ పార్సన్స్, క్వింటన్ డి కాక్, మాథ్యూ బ్రీట్‌జ్‌కేలా జోసెఫ్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్-హక్, జూనియర్ డాలా.