For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022 Retention Live: ఎలా చూడాలి..? చానల్, టైమింగ్స్ వివరాలు ఏంటంటే?

 How To Watch IPL 2022 Retention Live On TV: Date, Time And Live Streaming Details

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్‌లో పాత టీమ్స్‌లో ఎవరెవరు ఉంటారు? ఏ టీమ్ ఎంత మందిని రిటైన్ చేసుకుంటుంది? ఎంత మంది స్టార్ ప్లేయర్లు మెగా వేలంలోకి వస్తారు? ఈ ప్రశ్నలకు మరి కొన్ని గంటల్లో సమాధానం లభించనుంది. రిటెన్షన్‌కు మంగళవారమే డెడ్ లైన్ కావడంతో అటు ఫ్రాంచైజీ వర్గాల్లో ఇటు అభిమానుల్లో హీట్ పెరిగింది. నేటి(మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలలోపు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించాల్సి ఉంది.

ఆ తర్వాత రాత్రి 9.30 నుంచి ఆయా జట్ల రిటెన్షన్ జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించనుంది. ఈ కార్యక్రమం అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ మేరకు ఐపీఎల్ అధికారిక ట్విటర్‌లో నిర్వాహకులు ఓ ప్రకటనను విడుదల చేశారు.

డోంట్ మిస్ ఇట్..

'మెగా ఆక్షన్‌కు ముందు ఆయా జట్లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు ఎవరో తెలుసుకునే సమయం ఆసన్నమైంది. వీవీ ఐపీఎల్ రిటెన్షన్ లైవ్ అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్‌లను ఫాలో అవ్వండి. నవంబర్ 30 (మంగళవారం) రాత్రి 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ ఇండియా, డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది'అని ఐపీఎల్ నిర్వాహకులు ట్వీట్ చేశారు.

స్టార్ స్పోర్ట్స్ సంబంధిత చానెల్స్ స్టార్ స్పోర్ట్స్ 1, 3 తోపాటు స్థానిక భాషల్లోని తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చానెల్స్‌లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ఆయా భాషలకు సంబంధించిన క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ ఈ కార్యక్రమం నేపథ్యంలో తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.

కొత్త జట్ల రాకతో..

కొత్త జట్ల రాకతో..

ఐపీఎల్ విస్తరించాలనే లక్ష్యంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కొత్తగా రెండు జట్లను తీసుకురావడంతో మేగా వేలం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కొత్త జట్ల ప్రక్రియను పూర్తి చేసిన భారత క్రికెట్ బోర్డు భారీ ధరకు రెండు ఫ్రాంచైజీ హక్కులను కట్టబెట్టింది.

అహ్మదాబాద్ బేస్ ఫ్రాంచైజీని సీవీసి క్యాపిటల్స్ రూ.5625 కోట్లుకు దక్కించుకోగా.. లక్నో బేస్ టీమ్‌ను రూ. 7090 కోట్లకు ఆర్‌పీఎస్‌జీ సొంతం చేసుకుంది. కొత్త జట్ల ఎంపిక కూడా పూర్తవ్వడంతో మెగా వేలం నిర్వహణపై బీసీసీఐ దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ముందుగా ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియను ముగించే పనిలో నిమగ్నమైంది.

రిటెన్షన్ నిబంధనలు ఇవే..

రిటెన్షన్ నిబంధనలు ఇవే..

బీసీసీఐ రూపొందించిన రిటెన్షన్ రూల్స్ ప్రకారం పాత ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరేసి భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. అన్ క్యాప్‌డ్ ప్లేయర్స్ ఇద్దరిని మించకూడదు. జీత భత్యాల్లో కూడా రూల్స్ పాటించాలి.

నలుగురిని రిటైన్ చేసుకుంటే తొలి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్‌‌కు రూ. 12 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ. 8 కోట్లు, నాలుగో ప్లేయర్‌కు రూ.6 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన ఫ్రాంచైజీలు రూ.90 కోట్ల తమ పర్స్ వాల్యూ నుంచి రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది. ఈ రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిన ఆటగాళ్ల నుంచి కొత్త జట్లు 'పిక్ అప్' ఆప్షన్ కింద గరిష్టంగా ముగ్గురిని ఎంచుకోవచ్చు.

ఐపీఎల్ 2022 టీమ్స్ రిటెన్షన్ పూర్తి జాబితా..

ఐపీఎల్ 2022 టీమ్స్ రిటెన్షన్ పూర్తి జాబితా..

ఆయా టీమ్స్ రిటెన్షన్ జాబితాను ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో ఇప్పటికే ప్రకటించింది. స్పల్ప మార్పులు మినహా దాదాపు ఈ జాబితానే ఉంటుందని స్పష్టం చేసింది.

చెన్నై సూపర్ కింగ్స్: రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ

కోల్‌కతా నైట్‌రైడర్స్: సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తీ, వెంకటేశ్ అయ్యర్

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్

ఢిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్జ్

రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్

పంజాబ్ కింగ్స్: ఒక్కరిని కూడా రిటైన్ చేసుకోలేదు

Story first published: Tuesday, November 30, 2021, 10:11 [IST]
Other articles published on Nov 30, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+