Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022 ఫ్రీ‌గా చూడాలంటే ఏం చేయాలంటే? లైవ్ స్ట్రీమింగ్ వివరాలు!

How to watch IPL 2022 for free, TV, Online and Live Streaming Details

హైదరాబాద్: ధనాధన్ క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మళ్లీ వచ్చేసింది. క్రికెట్ ఫ్యాన్స్‌కు వేసివి వినోదం అందించేందుకు ముస్తాబైంది. కొత్తగా వచ్చిన రెండు టీమ్స్‌తో కలిపి మొత్తం పది జట్లు తమ అస్త్రశస్త్రాలతో పోటీకి సిద్దమయ్యాయి. కరోనా కారణంగా గత రెండేళ్లు ఖాళీ మైదానల్లో జరిగిన క్యాష్ రిచ్ లీగ్ ఈసారి.. పరిమిత సంఖ్యలోని ప్రేక్షకుల మధ్య జరగనుంది. ఖతర్నాక్ ఆటతో అభిమానులను అరించేందుకు ఆటగాళ్లంతా సిద్దమయ్యారు. మండు వేసవిలో టవరింగ్ సిక్సర్లు, రివ్వున దూసుకొచ్చే బౌన్సర్లు, మెరుపు ఫీల్డింగ్.. రసవత్తర పోరాటాలతో ఆనందాన్ని పంచేందుకు అస్త్రాలు రెడీ చేసుకున్నారు.

నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్..

నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్..

ఐపీఎల్‌తో అభిమానులకు సుమారు మూడు నెలలు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ లభించనుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య శనివారం(మార్చి 26)న జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2022 సీజన్ షురూ కానుంది. మే 29న జరిగే ఫైనల్‌లో ముగియనుంది. ఈ మ్యాచ్‌లన్నీ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 3 చానెల్స్‌తో పాటు ఆయా భాషలకు చెందిన స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్టార్ స్పోర్ట్స్ కన్నడ, స్టార్ స్పోర్ట్స్ మళయాళం, స్టార్ స్పోర్ట్స్ తమిళ చానెల్స్‌లో మ్యాచ్‌లు రానున్నాయి.

సొంత భాషలోనే కామెంట్రీ..

సొంత భాషలోనే కామెంట్రీ..

అభిమానుల అమ్మ భాషలోనే కామెంట్రీ అందించేందుకు స్టార్ స్పోర్ట్స్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆయా రాష్ట్రలకు సంబంధించిన చానెల్స్ ప్రారంభించిన స్టార్ ఇండియా.. ఈ సీజన్‌తో గుజరాతీలో కూడా కామెంట్రీ అందిస్తుంది. కేవలం కామెంట్రీకే పరిమితం కాకుండా ఆయా రాష్ట్రాల మాజీ క్రికెటర్లతో ప్రీ మ్యాచ్, పోస్ట్ మ్యాచ్ ప్రొగ్రామ్స్‌ను కూడా సొంత భాషలోనే అందిస్తుంది. తెలుగులో ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు కళ్యాణ్ కృష్ణ, కౌశిక్ తదితరులు వ్యాఖ్యానం చేయనున్నారు.

ఫ్రీగా చూడాలంటే..?

ఫ్రీగా చూడాలంటే..?

టీవీతో పాటు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వేదిక డిస్నీ హాట్‌స్టార్‌లో కూడా మ్యాచ్‌లు ప్రత్యక్షప్రసారం కానున్నాయి. అయితే డిస్నీ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటేనే మ్యాచ్‌లను చూడవచ్చు. ఏడాదికి రూ. 399 చెల్లించాలి. అయితే ఈ డబ్బులు లేకుండా ఫ్రీగా చూసే వెసులు బాటు కూడా ఉంది.కాకపోతే ఇది జియో, ఎయిర్‌టెల్ కస్టమర్లకు మాత్రమే. జియో కస్టమర్లు జియో టీవీ యాప్ ద్వారా, ఎయిర్‌టెల్ కస్టమర్లు ఎయిర్‌టెల్ టీవీ యాప్ ద్వారా మ్యాచ్‌లను ఫ్రీగా చూడవచ్చు. అయితే డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లేకపోయినా.. యాప్ మాత్రం మొబైల్‌లో ఉండాలి. అంతేకాకుండా ఈ రెండు నెట్‌వర్క్‌లు.. డిస్నీ హాట్ స్టార్ ప్యాకెజ్ సబ్‌స్క్రీప్షన్‌తో కలిపి మొబైల్ రిచార్జ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. వాటితో కూడా ఫ్రీగా చూసే వెసులుబాటు ఉంది.

Story first published: Friday, March 25, 2022, 16:27 [IST]
Other articles published on Mar 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+