Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England మహిళల టీ20 సిరీస్‌.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?

ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత మహిళల జట్టు తొలి మ్యాచ్ సిద్దమైంది. ముందుగా ఐదు టీ20ల సిరీస్ ఆడనున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ శనివారం జరగనుంది.భారత కాలమానం ప్రకారం నాటింగ్‌హామ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

ఇప్పటికే భారత మహిళల జట్టు ఇంగ్లండ్ చేరి సన్నాహకాలు పూర్తి చేసుకుంది. జూలై 1, 4, 9, 12న తర్వాతి నాలుగు టీ20 మ్యాచ్‌లు జరగనుండగా.. జూలై 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది.

How to Watch India Women vs England Women Cricket Series for Free

ఫ్రీగా చూడాలంటే..?

భారత్, ఇంగ్లండ్ మహిళల టీ20, వన్డేల సిరీస్‌లకు సోనీ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. సోనీ స్పోర్ట్స్ 1 ఛానెల్‌తో పాటు సోనీ లైవ్ యాప్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ మ్యాచ్‌లను చూడవచ్చు. అయితే ఫ్రీగా చూడాలంటే జియో యూసర్జ్ జియో టీవీ యాప్‌లో సోనీ స్పోర్ట్స్ 1 ఛానెల్ సెలెక్ట్ చేసుకోని చూడాలి. ఎయిర్టెట్ యూజర్స్ ఎయిర్టెల్ టీవీ యాప్‌లో చూడవచ్చు.

భారత్ :
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, రాధా యాదవ్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రీ చరాణి, యస్తికా భాటియా, అమన్‌జోత్ కౌర్, స్నేహ్ రానా, సయాలీ సత్ఘరే, క్రాంతి గౌడ్.

ఇంగ్లండ్ :
నాట్ సివర్-బ్రంట్ (కెప్టెన్), సోఫియా డంకెల్, డెనియెల్ వ్యాట్-హాడ్జ్, అమీ జోన్స్, ఆలిస్ క్యాప్సీ, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, లిన్సీ స్మిత్, లారెన్ బెల్, లారెన్ ఫిలర్, ఇస్సీ వాంగ్, పైజ్ షాఫీల్డ్, టామీ బ్యూమాంట్, ఎం ఆర్లాట్.

Story first published: Saturday, June 28, 2025, 12:00 [IST]
Other articles published on Jun 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+