
ఫ్రీగా చూడాలంటే..
సోనీ చానెల్స్‌తో పాటు ఆ సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లీవ్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. భారత ప్రభుత్వానికి దూరదర్శన్ స్పోర్ట్స్‌లో కూడా మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి. వెస్టిండీస్ పర్యటన మ్యాచ్‌లన్నీ డీడీ స్పోర్ట్స్‌లోనే వచ్చాయి. డీడీ స్పోర్ట్స్ చానెల్‌ను ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఫ్రీగా చూడవచ్చు. ఇక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఫ్రీగా చూడాలంటే మాత్రం జియో టీవీ, ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లు ఉండాలి. ఈ యాప్స్ సాయంతో ఫ్రీగా డబ్బులు కట్టకుండా మ్యాచ్‌లు వీక్షించవచ్చు. మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రారంభం కానున్నాయి.

సీనియర్లు దూరం..
ఈ పర్యటనకు రోహిత్ శర్మతో పాటు కోహ్లీ, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్‌కు ఈ పర్యటన నుంచి విశ్రాంతి ఇచ్చారు. గాయంతో జట్టుకు దూరంగా ఉన్న దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్‌లు ఈ పర్యటనతో మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు గాయపడ్డ దీపక్ చాహర్ మళ్లీ ఇన్నాళ్లకు మైదానంలోకి బరిలోకి దిగుతున్నాడు.

యువ ఆటగాళ్లకు చాన్స్..
కౌంటీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న సుందర్ సైతం చాలా రోజుల తర్వాత మళ్లీ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. రాహుల్ త్రిపాఠి మరోసారి భారత జట్టు పిలుపు ను అందుకోగా.. సిరాజ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణలు కొనసాగుతున్నారు.

జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు
శిఖర్ ధావన్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్


Click it and Unblock the Notifications












