Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Sri Lanka టెస్ట్ సిరీస్.. జియో హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

శ్రీలంక పర్యటనలో టీమిండియా తొలి పోరుకు సిద్దమైంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం(ఆగస్ట్ 15) నుంచి గాలే వేదికగా ప్రారంభం కానున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌ టీమిండియాకు అత్యంత కీలకం.

డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ సిరీస్‌ను భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేయాలి. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్ట్‌ల్లో టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. ఈ క్రమంలోనే శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జట్టు నిండా కుర్రాళ్లే ఉండటంతో భారత్ ఏ మేరకు రాణిస్తుందో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ముగ్గరు స్పిన్నర్లతో టీమిండియా..

శ్రీలంక ఎలెవన్‌తో మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో విజయం సాధించడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ముఖ్యంగా టెయిలెండర్ మహమ్మద్ సిరాజ్ ఆఖరి ఓవర్‌లో వరుసగా మూడు సిక్స్‌లు బాది విజయాన్ని అందించడం ఆటగాళ్లకు మరింత ఆనందాన్నిచ్చింది. అదే జోరులో తొలి టెస్ట్‌లో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. శ్రీలంకలో పిచ్‌లు సాధారణంగా స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. ఈ క్రమంలోనే టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

How to Watch India vs Sri Lanka Test Series for Free Match Timings and Broadcast Details

జియో‌ హాట్‌స్టార్‌లో రాదు..

అయితే ఈ సిరీస్‌కు సోనీ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. దాంతో జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్‌లు రావు. శ్రీలంక సిరీస్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలంటే సోనీ టీవీ ఛానెల్స్‌తో పాటు సోనీ లివ్ యాప్‌‌ను సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ఈ వేదికల్లో ఫ్రీగా చూసే అవకాశం లేదు.

ఫ్రీగా ఎలా చూడాలంటే..?

జియో, ఎయిర్టెల్ మొబైల్ యూజర్లు ప్రత్యేక రిఛార్జ్ ప్లాన్స్‌తో సోనీ లీవ్ యాప్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీగా పొందవచ్చు. అయితే డీడీ స్పోర్ట్స్‌ టీవీ ఛానెల్‌లో ఎలాంటి రుసుము లేకుండా భారత్, శ్రీలంక సిరీస్ మ్యాచ్‌లు ఫ్రీగా చూడవచ్చు.

షెడ్యూల్, టైమింగ్స్..

ఆగస్ట్ 15-19 వరకు గాలే వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుండగా.. ఆగస్ట్ 3 నుంచి 27 వరకు రెండో టెస్ట్‌ జరగనుంది. భారత కాలమానం ప్రకారం 10 గంటలకు ఈ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

ఇరు జట్లు:

భారత్: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), అకీబ్ నబీ, గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా, సరాన్ష్ జైన్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్

శ్రీలంక: ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), లహిరు ఉదార, నిషాన్ మదుష్క, దినేష్ చండిమల్, పసిందు సూర్యబండార, సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా (వికెట్), రమేష్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, కేశర నువంత, మిలన్ ద్రువాల్నాండో, ఎఫ్‌సి ధృవాల్నాండో, ఎఫ్. మధుశంక.

Story first published: Thursday, August 13, 2026, 11:49 [IST]
Other articles published on Aug 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+