For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Sri Lanka టీ20 సిరీస్.. ఫ్రీగా ఎలా చూడాలంటే?

How to watch India vs Sri Lanka T20 Series for free, Live streaming info, squads and match time

హైదరాబాద్: సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌తో టీమిండియా కొత్త ఏడాది ప్రారంభించనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం(జనవరి 3) వాంఖడే వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌కు దూరంగా ఉండగా.. హార్దిక్ పాండ్యా సారథ్యంలో యువ జట్టు ఈ మ్యాచ్ బరిలోకి దిగనుంది. టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఈ సిరీస్‌తోనే సన్నాహకం మొదలుపెట్టనుంది. సీనియర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లు అవకాశాలు అందుకోనున్నారు. ఈ పర్యటనలో శ్రీలంక.. భారత్‌తో మొత్తం మూడు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. వన్డే సిరీస్‌తో రోహిత్, కోహ్లీ,కేఎల్ రాహుల్‌లు రీఎంట్రీ ఇవ్వనున్నారు.
షెడ్యూల్, టైమింగ్స్..

షెడ్యూల్, టైమింగ్స్..

మూడు టీ20ల సిరీస్ మంగళవారం(జనవరి 3) నుంచి జనవరి 7 వరకు జరగనుంది. వాంఖడే వేదికగా తొలి మ్యాచ్ జరగనుండగా.. గురువారం(జనవరి 7) పుణే వేదికగా రెండో టీ20, శనివారం(జనవరి 7) రాజ్ కోట్ వేదికగా మూడో టీ20 నిర్వహించనున్నారు. టీ20 మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. అనంతరం జనవరి 10 నుంచి 15 వరకు మూడు వన్డేల సిరీస్ జరగనుంది. జనవరి 10న గువాహటి వేదికగా తొలి వన్డే, జనవరి 12 ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో వన్డే, జనవరి 15న తిరువనంతపురం వేదికగా మూడో వన్డే నిర్వహించనున్నారు. వన్డే మ్యాచ్‌లు

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

ఏ చానెల్‌లో వస్తుందంటే..?

ఏ చానెల్‌లో వస్తుందంటే..?

సొంతగడ్డపై జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌‌లకు అధికారి బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్. శ్రీలంక‌తో జరిగే ఈ రెండు సిరీస్‌లు కూడా స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ చానెల్స్‌లో ప్రసారం కానున్నాయి. ఈ నెట్ వర్క్‌కు చెందిన స్టార్‌ స్పోర్ట్స్‌ 1, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హెచ్‌డీ, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హిందీ, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మళయాళం, తమిళం తదితర చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. స్థానిక భాషల్లో కామెంట్రీ లభించనుంది. స్టార్ నెట్‌వర్క్‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ ఈ మ్యాచ్‌లు ప్రత్యక్షప్రసారం కానున్నాయి.

ఫ్రీగా చూడాలంటే..?

ఫ్రీగా చూడాలంటే..?

స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌లను ఫ్రీగా చూడాలంటే జియో, వోడాఫోన్, ఎయిర్టెట్ కస్టమర్లు ప్రత్యేక ప్లాన్ రిచార్జ్‌తో ఫ్రీగా చూడవచ్చు. జియో సిబ్ ఉన్నవారు జియో టీవీ యాప్ ద్వారా ఎలాంటి రుసుము లేకుండా ఈ మ్యాచ్‌లు వీక్షించవచ్చు. జియో టీవీ యాప్‌లో స్టార్ స్పోర్ట్స్ చానెల్‌ను సెలెక్ట్ చేసుకొని చూడవచ్చు.

భారత జట్లు:

భారత జట్లు:

టీ20: హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, రుతురాజ్ గై​క్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, సంజు శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌, ఉమ్రాన్, శివమ్ మావి, ముకేశ్‌ కుమార్‌.

వన్డే టీమ్: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌, శ్రేయస్ అయ్యర్‌, రాహుల్, ఇషాన్‌ కిషన్, సుందర్, చహల్, కుల్దీప్, అక్షర్, షమీ, సిరాజ్, ఉమ్రాన్, అర్ష్‌దీప్‌ సింగ్‌

శ్రీలంక

శ్రీలంక

డసన్ షనక (కెప్టెన్), పాతుమ్ నిసాంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, కుశాల్ మెండిస్ (వన్డేలకు వైస్‌ కెప్టెన్‌), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ (టీ20 వైస్‌ కెప్టెన్‌), ఆషేన్‌ బండార, మహీశ్‌ తీక్షణ, జెఫ్రీ వాండర్సే (వన్డేలకు మాత్రమే), చమికా కరుణరత్నే, దిల్షాన్ మధుశంక, కసున్ రజిత, నువానీదు ఫెర్నాండో (వన్డేలకు మాత్రమే), దునిత్ వెల్లలగే, ప్రమోద్ మధుషన్, లాహిరు కుమార, నువాన్ తుషార (టీ20లకు మాత్రమే).

Story first published: Monday, January 2, 2023, 18:19 [IST]
Other articles published on Jan 2, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+