Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs South Africa మ్యాచ్‌లు ఫ్రీగా చూడాలంటే ఏం చేయాలంటే..?

How to watch India vs South Africa T20I Series for free

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాతో సన్నాహకంగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న టీమిండియా మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. ఆసియాకప్ వైఫల్యాన్ని మరిపిస్తూ అందుకున్న ఈ విజయం ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంపోదించింది. ఇదే జోరులో
వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా సౌతాఫ్రికాతో సొంతగడ్డపై మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా వచ్చే బుధవారం(సెప్టెంబర్ 28)న తొలి మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ సెట్ చేసిన టీమిండియా.. ఈ సిరీస్‌తో బౌలింగ్, ఫీల్డింగ్‌ను మెరుగుపరుచుకోవడంపై ఫోకస్ పెట్టింది.

మూడు ఆప్షన్స్‌తో..

మూడు ఆప్షన్స్‌తో..

ఆస్ట్రేలియాతో దారుణంగా విఫలమైన హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా‌ ఈ సిరీస్‌తో గాడిన పడటం చాలా ముఖ్యం. విశ్రాంతి తీసుకున్న అర్ష్‌దీప్ సింగ్ కూడా ప్రపంచకప్ ముందు మెరుగవ్వాల్సి ఉంది. ప్రపంచకప్‌ నాటికి బౌలింగ్‌ లయను అందుకోవాలని భారత్ ఆశిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లు అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌, డిస్నీహాట్‌సార్ట్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. డబ్బులు చెల్లించే స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఓ మూడు పద్దతుల ద్వారా మ్యాచ్‌లను ఫ్రీగా చూడవచ్చు.

1. మొబైల్ రిచార్జ్ ప్లాన్స్‌తో..

1. మొబైల్ రిచార్జ్ ప్లాన్స్‌తో..

మాములుగా మనం చేసుకునే మొబైల్ రిచార్జ్ ప్లాన్స్ ద్వారా హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. జియో, ఎయిర్టెల్, వీఐ యూజర్లకు చాలా ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. మొబైల్ వాడకం కోసం మాములుగా చేసుకునే రిచార్జ్ ప్లాన్స్ కంటే కొంచెం అదనంగా చెల్లించి ప్లాన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

2. జియో టీవీ..

2. జియో టీవీ..

ఇక జియో టీవీ యాప్ ద్వారా కూడా భారత్ X సౌతాఫ్రికా మ్యాచ్‌లను ఫ్రీగా చూడవచ్చు. జియో టీవీ యాప్‌లో స్టార్ స్పోర్ట్స్ అని సెర్చ్ చేసి మ్యాచ్‌ను వీక్షించవచ్చు. అయితే ఇది జియో నెట్‌వర్క్ ఉన్న యూజర్లకు మాత్రమే.

3.డీడీ స్పోర్ట్స్‌లో..

3.డీడీ స్పోర్ట్స్‌లో..

కేంద్ర ప్రభుత్వానికి చెందిన దూరదర్శన్ స్పోర్ట్స్ చానెల్‌లో కూడా ఈ మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి. ఈ చానెల్‌ను టీవీలో ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఫ్రీగా చూడవచ్చు.

షెడ్యూల్‌ ఇదే..

షెడ్యూల్‌ ఇదే..

భారత్‌ సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20లు జరుగుతాయి. తొలి మ్యాచ్ సెప్టెంబర్ 28 (బుధవారం) తిరువనంతపురం వేదికగా జరుగుతుంది. అలాగే రెండో టీ20 మ్యాచ్‌ గౌహతి వేదికగా అక్టోబర్ 2 (ఆదివారం), చివరి టీ20 ఇండోర్ వేదికగా అక్టోబర్ 4 (మంగళవారం)న జరగనుంది. ప్రతి మ్యాచ్‌ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్, దినేశ్‌ కార్తిక్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్,అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ, బుమ్రా, దీపక్ చాహర్, హర్షల్‌ పటేల్

సౌతాఫ్రికా: టెంబా బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రీక్స్, హెన్రీచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జ్, వ్యాన్ పర్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడా, రిలీ రసౌ, తబ్రైజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్, బ్జోర్న్ ఫర్చిన్, మార్కో జాన్సెన్, అండిలే పెహ్లుక్వాయో

Story first published: Monday, September 26, 2022, 22:01 [IST]
Other articles published on Sep 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+