Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ X పాక్ మ్యాచ్.. ఫ్రీగా ఎలా చూడాలంటే?

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో శుభారంభం చేసిన భారత్.. మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఆదివారం కొలంబో వేదికగా జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్‌లో దాయాదీ పాకిస్థాన్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే ముగిసిన పురుషుల ఆసియా కప్ 2025 టోర్నీలో ఇరు జట్ల మధ్య అనేక వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి.

నో షేక్ హ్యాండ్ కంటిన్యూ..

పాకిస్థాన్‌ ఆటగాళ్లతో భారత ప్లేయర్స్ కరచాలనం చేయలేదు. ఇరు జట్లు ఐసీసీకి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని నిరాకరించేందుకు భారత్ నిరాకరించింది. దాంతో ఆ ట్రోఫీని నఖ్వీ తన వెంట తీసుకెళ్లాడు. ఇప్పటికీ ఆ ట్రోఫీని భారత్ అందుకోలేదు. ఇరు జట్ల మధ్య ఈ ఘటనపై తీవ్ర వాదోపవాదాలు నడుస్తున్నాయి.

How to Watch India vs Pakistan Women s World Cup 2025 Match Live for Free in India

ముఖా ముఖి రికార్డ్ 11-0

అయితే ఈ వరుస సంఘటనలు భారత్, పాక్ మహిళల మ్యాచ్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపనున్నాయి. పాకిస్థాన్ మహిళా ప్లేయర్లకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చేది లేదని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పష్టం చేసింది. మైదానంలో ఇరు జట్ల మధ్య మాటల యుద్దం నడిచే అవకాశం ఉంది. ప్రస్తుత ఫామ్ చూసుకున్నా.. గత రికార్డులను పరిగణలోకి తీసుకున్నా భారత మహిళల జట్టుకు పాకిస్థాన్ మహిళల టీమ్ ఏ మాత్రం పోటీ కాదు. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 11 వన్డేలు జరగ్గా.. అన్ని మ్యాచ్‌లను టీమిండియానే గెలిచింది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ మహిళల టీమ్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఫ్రీగా ఎలా చూడాలంటే..?

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీకి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. స్టార్ స్పోర్ట్స్‌కు చెందిన హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం తదితర భాషల ఛాన్సెల్‌తో పాటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ జియో హాట్ స్టార్ వేదికగా ఈ మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్ చూడాలంటే ఛానెల్స్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. కానీ డీడీ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. హాట్‌స్టార్‌లోనూ భారత్-పాక్ మ్యాచ్‌ను ఫ్రీగా చూడవచ్చు. మహిళల క్రికెట్ అయినా.. భారత్-పాక్ మ్యాచ్‌కు సపరేట్ క్రేజ్ ఉంటుంది.

భారత మహిళల జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్-కెప్టెన్), ప్రతిక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్తిక భాటియా, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్.

పాకిస్థాన్ మహిళల జట్టు:

మునీబా అలీ, ఒమైమా సోహైల్, సిద్రా అమీన్, సిద్రా నవాజ్ (వికెట్ కీపర్), నటాలియా పర్వేజ్, ఫాతిమా సనా (కెప్టెన్), ఈమన్ ఫాతిమా, రమీన్ షమీమ్, షావాల్ జుల్ఫికర్, సయ్యదా ఆరూబ్ షా, డైయానా బేగ్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్, అలియా రియాజ్, సదాఫ్ షమాస్.

Story first published: Saturday, October 4, 2025, 12:33 [IST]
Other articles published on Oct 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+