పురుషుల అండర్ 19 ప్రపంచకప్‌లో శుభారంభం చేసిన భారత్.. హైఓల్టేజ్ మ్యాచ్‌కు సిద్దమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ అండర్ 19 టీమ్‌తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది.
యూఏఈతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు 234 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైభవ్ సూర్యవంశీ(95 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్స్‌లతో 171) భారీ శతకంతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో భారత్ అండర్ 19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 433 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం యూఏఈ 199/7 స్కోర్‌కే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది.

మరోవైపు పాకిస్థాన్.. తమ తొలి మ్యాచ్‌లో మలేషియాను 297 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి మంచి జోష్‌లో ఉంది. ఇదే జోరులో భారత్‌ను చిత్తు చేయాలనే పట్టుదలతో పాకిస్థాన్ ఉంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇరు జట్ల ముఖా ముఖి పోరులో భారత్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 27 యూత్ వన్డేలు జరగ్గా.. భారత్ 15 గెలిచి 11 ఓడింది. మరో మ్యాచ్ టై అయ్యింది. అండర్ 19 ఆసియా కప్‌లో ఇరు జట్లు 10 మ్యాచ్‌లు ఆడగా.. భారత్ 4 గెలిచి 5 ఓడింది. ఒక మ్యాచ్ టై అయ్యింది.
ఈ టోర్నీకి సోనీ టీవీ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. సోనీ టీవీ ఛానెల్స్‌తో పాటు సోనీ లీవ్ ఓటీటీ యాప్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ మ్యాచ్‌లు ఫ్రీగా చూసే ఆస్కారం లేదు. సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. అయితే జియో ప్రత్యేకమైన రిఛార్జ్ ప్లాన్‌తో సోనీలీవ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.
ఆయుష్ మత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా (ఉప-కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్ (వికెట్ కీపర్), యువరాజ్ గోహిల్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ ఏ. పటేల్, నమన్ పుష్పక్, డి. దీపేష్, హెనిల్ పటేల్, కిషన్ కుమార్ సింగ్, ఉధవ్ మోహన్, ఆరోన్ జార్జ్.
సాద్ బేగ్ (కెప్టెన్), అబ్దుల్ సుభన్, అహ్మద్ హుస్సేన్, అలీ రజా, ఫాహమ్-ఉల్-హక్, ఫర్హాన్ యూసుఫ్, హారూన్ అర్షద్, మహ్మద్ అహ్మద్, మహ్మద్ హుజైఫా, మహ్మద్ రియాజుల్లా, నవీద్ అహ్మద్ ఖాన్, షాజైబ్ ఖాన్, తయ్యబ్ ఆరిఫ్, ఉమర్ జైబ్, ఉస్మాన్ ఖాన్.