Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 Asia Cup 2024: భారత్ X పాక్ మ్యాచ్‌.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?

అండర్ 19 ఆసియా కప్ 2024కు రంగం సిద్దమైంది. దుబాయ్, షార్జా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను దాయాదీ పాకిస్థాన్‌తో ఆడనుంది. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం 10.30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడుతుండగా.. రెండు గ్రూప్‌లుగా విభజించారు. భారత్, పాకిస్థాన్, జపాన్, యూఏతో గ్రూప్-బీలో ఉండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, నేపాల్ గ్రూప్-ఏలో ఉన్నాయి.

How To Watch India vs Pakistan U19 Asia Cup 2024 Match For Free

ఫ్రీగా ఎలా చూడాలంటే..
అండర్ 19 ఆసియాకప్ టోర్నీ బ్రాడ్‌కాస్టింగ్ ఇండియా రైట్స్ సోనీ నెట్‌వర్క్‌కు ఉన్నాయి. సోనీకి చెందిన ఛానెల్స్‌తో పాటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీలివ్‌లో ఈ టోర్నీ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సోనీ టీవీ ఛానెల్స్, సోనీ లీవ్ సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాలి. జియో, ఎయిర్టెల్ యూజర్స్ ఈ టోర్నీ మ్యాచ్‌లను ఫ్రీగా చూడవచ్చు. జియో టీవీ, ఎయిర్టెల్ టీవీ యాప్‌లో సోనీ టెన్ ఛానెల్స్‌ను ఎంచుకొని ఈ టోర్నీ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

13 ఏళ్ల కుర్రాడిపైనే అందరి కళ్లు..
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. కోటీ 10 లక్షలు పలికిన భారత యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీపైనే అందరి కళ్లు ఉన్నాయి. 13 ఏళ్ల వయసులోనే ఈ బీహార్ కుర్రాడు భారత అండర్ 19 జట్టుకు ఎంపికవ్వడంతో పాటు ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికాడు. రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేసింది. దాంతో అండర్ 19 ఆసియా కప్‌లో వైభవ్ సూర్య వంశీ హాట్ ఫేవరేట్‌గా మారాడు.

జట్లు:

భారత్: ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆండ్రీ సిద్దార్థ్, మహమ్మద్ అమన్(కెప్టెన్), కిరణ్ కోర్మాలే(వైస్ కెప్టెన్), ప్రణవ్ పంత్, హర్వన్ష్ సింగ్ పంగాలియా(కీపర్), అనురాగ్, హార్దిక్ రాజ్, మహమ్మద్ ఇనాన్, కేపీ కార్తీకేయ, సమర్థ్ నాగ్‌రాజ్, యుధజిత్ గుహ, చేతన్ శర్మ, నిఖిల్ కుమార్

పాకిస్థాన్: సాద్ బైగ్, మహమ్మద్ అహ్మద్, హరూన్ అర్షద్, టయ్యబ్ ఆరిఫ్, మహమ్మద్ హుజెఫ, నవీద్ అహ్మద్ ఖాన్, హసన్ ఖాన్, షెహ్‌జైబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఫహమ్ ఉల్ హక్, అలీ రాజా, మహమ్మద్ రైజుల్లా, అబ్దుల్ సుభాన్, ఫర్హాన్ యూసఫ్, ఉమర్ జైబ్.

Story first published: Friday, November 29, 2024, 18:14 [IST]
Other articles published on Nov 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+