Asia Cup 2025: భారత్ X పాక్ ఫైనల్.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?
ఆసియా కప్ 2025 టోర్నీ తుది దశకు చేరింది. ఆదివారం జరిగే ఫైనల్లో దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్, పాకిస్థాన్ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. భారత్ చేతిలో చిత్తుగా ఓడినా.. పట్టుదలతో ఆడిన పాకిస్థాన్ ఫైనల్ చేరింది. తుది పోరులో భారత్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో పాక్ ఉంది.అయితే ఫామ్ చూసుకున్నా.. బలబలాలు పరిశీలించినా.. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు పాకిస్థాన్ ఏ మాత్రం పోటీ కాదు. అలా అని పాకిస్థాన్‌ను ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా భారత జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ ఆటగాళ్లు కవ్వింపులకు పాల్పడటం.. భారత ఆటగాళ్లు బ్యాట్‌తో బదులివ్వడంతో వాతావరణ వేడెక్కింది. ఫైనల్లో అంతుకుమించిన డ్రామా ఉండనుంది. ఏకపక్షంగా సాగిన ఈ టోర్నీని చాలా మంది అభిమానులు పట్టించుకోలేదు. మరికొందరు ఈ టోర్నీ అధికారిక బ్రాడ్‌కాస్టర్ అయిన సోనీ టీవీ, సోనీ లైవ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోలేక లైట్ తీసుకున్నారు.

సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటే డబ్బులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ మ్యాచ్‌లను మొబైల్స్‌లో ఫ్రీగా చూసే అవకాశం కూడా ఉంది. ముఖ్యం జియో యూజర్లు.. ప్రత్యేక రిచార్జ్ ప్లాన్స్‌తో సోనీ లివ్ యాప్‌ను ఫ్రీగా సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆ ప్లాన్స్ వివరాల గురించి తెలుసుకుందాం.
- జియో రూ. 445 తో రిచార్జ్ చేసుకుంటే 56 రోజుల పాటు ప్రతీ రోజు 2జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్ పొందవచ్చు. అంతేకాకుండా సోనీ లివ్‌తో పాటు జీ5 వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తోంది.
- రూ. 175 రిచార్జ్‌తో 28 రోజుల పాటు 10జీబీ డాటాతో పాటు సోనీ లివ్‌తో పాటు 10 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.
- రూ. 1049 రిచార్జ్‌తో 84 రోజుల పాటు ప్రతీ రోజు 2జీబీ డాటాతో పాటు సోనీ లివ్, జీ5, జియోటీవీ ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.
- ఇతర నెట్‌వర్క్ యూజర్లు కూడా తమ మొబైల్ రిఛార్జ్ ప్లాన్స్ చెక్ చేసుకొని సోనీ లీవ్ యాప్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంచుకుంటే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను ఫ్రీగా ఆస్వాదించవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications