For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England టీ20 సిరీస్.. జియోసినిమాలో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

ఆస్ట్రేలియా పర్యటనను ఘోర పరాజయంతో ముగించిన టీమిండియా.. 17 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అప్‌కమింగ్ ఐసీసీ టోర్నీ అయిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి ముందు ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ను టీమిండియా సన్నాహకంగా వాడుకోనుంది.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడే జట్టే దాదాపు ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగనుంది. ఈ క్రమంలోనే ఈ సిరీస్‌లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముందుగా ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్ జనవరి 22 నుంచి ప్రారంభం కానుంది. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 కోల్‌కతా వేదికగా జనవరి 22 నుంచి ప్రారంభం కానుంది. రెండో టీ20 చెన్నై వేదికగా జనవరి 25, మూడో టీ20 రాజ్‌కోట్ వేదికగా జనవరి 28న, నాలుగో టీ20 పుణే వేదికగా జనవరి 31న, ఐదో టీ20 ఫిబ్రవరి 2న ముంబై వేదికగా జరగనుంది. టీ20 మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.

How to Watch India vs England T20I series for free full schedule and timings

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో సిరీస్‌లకు దూరంగా ఉండనున్నాడు. సూర్యకుమార్ యాదవ్ టీమిండియా టీ20 సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లతో కూడిన జట్టు ఈ సిరీస్ ఆడనుంది. టీ20 సిరీస్‌లో కుర్రాళ్లకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ షెడ్యూల్..
జనవరి 22, తొలి టీ20(కోల్‌కతా)
జనవరి 22, రెండో టీ20(చెన్నై)
జనవరి 28, మూడో టీ20(రాజ్‌కోట్)
జనవరి 31, నాలుగో టీ20(పుణె)
ఫిబ్రవరి 2, ఐదో టీ20(ముంబై)

ఫ్రీగా ఎలా చూడాలంటే..?
ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్, మూడు వన్డేల సిరీస్‌కు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరించనుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్షప్రసారం కానుంది. స్టార్ నెట్ వర్క్‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్షప్రసారం కానున్నాయి. అయితే డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌లు ఫ్రీగా చూసే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

గతంలో హాట్‌స్టార్‌లో ఫ్రీగా మ్యాచ్‌లు చూసే వెసులు బాటు ఉంది. రిలయన్స్ నెట్‌వర్క్‌తో భాగస్వామిగా మారడంతో డిస్నీ హాట్‌స్టార్‌లో ఫ్రీగా మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కావడం లేదు. సంబంధింత మొబైల్ నెట్ వర్క్ రిఛార్జ్ ఆఫర్స్‌తో ఈ మ్యాచ్‌లను ఫ్రీగా చూడవచ్చు.

Story first published: Tuesday, January 7, 2025, 18:41 [IST]
Other articles published on Jan 7, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+