Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG టీ20 సిరీస్ ఎల్లుండే షురూ.. ఎలా చూడాలంటే?

ఆస్ట్రేలియా‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 1-3తో కోల్పోయిన టీమిండియా వైట్‌బాల్‌ సిరీస్‌లకు సిద్దమైంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ముందుగా టీ20 సిరీస్‌ జరగనుండగా.. బుధవారం కోల్‌కతా వేదికగా జరిగే తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు కోల్‌కతా చేరి ప్రాక్టీస్ ప్రారంభించాయి.

ఆస్ట్రేలియా పర్యటన‌లో ఆడిన ఆటగాళ్లంతా ఈ టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో కుర్రాళ్లతో కూడిన జట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ కోల్‌కతా వేదికగా 3 రోజుల ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఆదివారమే ఈ ప్రాక్టీస్ శిభిరం ప్రారంభమవ్వగా.. ఆటగాళ్లంతా పాల్గొని ముమ్మరంగా సాధన చేస్తున్నారు.

How to Watch India vs England 5 Matches T20I series

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వెన్ను గాయంతో జస్‌ప్రీత్ బుమ్రా ఈ టీ20 సిరీస్‌కు దూరంగా ఉండగా.. శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, మహమ్మద్ సిరాజ్‌లకు విశ్రాంతినిచ్చారు.

చీల మండ గాయంతో గత 14 నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉన్న మహమ్మద్ షమీ.. ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సిరీస్ అతనికి కీలకంగా మారనుంది. ఈ సిరీస్‌లో సత్తా చాటి ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే అతను ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టులో కొనసాగనున్నాడు. మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ షెడ్యూల్..
జనవరి 22, తొలి టీ20(కోల్‌కతా)
జనవరి 22, రెండో టీ20(చెన్నై)
జనవరి 28, మూడో టీ20(రాజ్‌కోట్)
జనవరి 31, నాలుగో టీ20(పుణె)
ఫిబ్రవరి 2, ఐదో టీ20(ముంబై)

ఫ్రీగా ఎలా చూడాలంటే..?
ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్, మూడు వన్డేల సిరీస్‌కు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్షప్రసారం కానుంది. స్టార్ నెట్ వర్క్‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్షప్రసారం కానున్నాయి. అయితే డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌లు ఫ్రీగా చూసే అవకాశం లేదు. సంబంధింత మొబైల్ నెట్ వర్క్ రిఛార్జ్ ఆఫర్స్‌తో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొంది ఈ మ్యాచ్‌లను ఫ్రీగా చూడవచ్చు.

Story first published: Monday, January 20, 2025, 17:58 [IST]
Other articles published on Jan 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+