Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Bangladesh వన్డే సిరీస్ హాట్‌స్టార్‌లో రాదు.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?

How to watch India vs Bangladesh ODI Series for free, Live streaming info, squads and match time

హైదరాబాద్: మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ల కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా తొలి సమరానికి సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకా వేదికగా ఆదివారం జరిగే తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇస్తున్నారు.

టీ20 ప్రపంచకప్ అనంతరం విశ్రాంతి తీసుకున్న కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం తిరిగి తన బాధ్యతలు చేపట్టాడు. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా ఈ సిరీస్ నుంచే సన్నాహకం మొదలు పెట్టనుంది. దాంతో ఈ సిరీస్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

షెడ్యూల్, టైమింగ్స్..

మూడు వన్డేల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఢాకా‌లోని షేర్ ఈ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. తొలి వన్డే ఆదివారం జరగనుండగా.. రెండో వన్డే డిసెంబర్ 7న, మూడో వన్డే డిసెంబర్ 10న జరగనుంది. మూడు వన్డే మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 14-18 వరకు చట్టోగ్రమ్ వేదికగా తొలి టెస్ట్, డిసెంబర్ 22-26 వరకు ఢాకా వేదికగా రెండో టెస్ట్ జరగనుంది. రెండు టెస్ట్‌లు 9.30కు ప్రారంభం కానున్నాయి.

ఏ చానెల్‌లో వస్తుందంటే..?

ఏ చానెల్‌లో వస్తుందంటే..?

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు సోనీ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్ కాస్టర్. మూడు వన్డేలు, రెండు టెస్ట్‌లు సోనీ టెన్1, 2,3, 4 చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సోనీ నెట్‌వర్క్‌కు చెందిన సోనీ లివ్ యాప్‌లో మ్యాచ్‌లు రానున్నాయి. జియో టీవీ యాప్ ద్వారా ఈ పర్యటనలోని అన్ని మ్యాచ్‌లను ఫ్రీగా వీక్షించవచ్చు.

వన్డే టీమ్స్..

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, షెహ్‌బాజ్ అహ్మద్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్

బంగ్లాదేశ్ వన్డే జట్టు: తమీమ్ ఇక్బాల్(కెప్టెన్), యాసిర్ అలీ, నజ్ముల్ హోస్సెన్ షాంటో, షకీబ్ అల్ హసన్, అఫిఫ్ హోస్సెన్, మహ్మదుల్లా, మెహిదీ హసన్ మీర్జా, లిటన్ దాస్, అనముల్ హక్, ముష్ఫికర్ రహీమ్, నురుల్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, టస్కిన్ అహ్మద్, హసన్ మహముద్, ఎబ్డాట్ హోస్సెన్, నసుమ్ అహ్మద్.

టెస్ట్ టీమ్స్..

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రీకర్ భరత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్.

బంగ్లా దేశ్ టెస్ట్ టీమ్ ఇంకా ప్రకటించలేదు..

Story first published: Saturday, December 3, 2022, 7:54 [IST]
Other articles published on Dec 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+