Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 World Cup 2024: భారత్ X ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్.. ఫ్రీగా ఎలా చూడాలంటే?

అండర్ 19 ప్రపంచకప్ 2024లో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా తుదిపోరుకు సిద్దమైంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వరుస విజయాలు అందుకున్న టీమిండియా.. అదే జోరులో ఫైనల్ గెలిచి ఆరో టైటిల్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

మరోవైపు పాకిస్థాన్‌తో సెకండ్ సెమీఫైనల్లో ఒక్క వికెట్‌తో థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్న ఆస్ట్రేలియా నాలుగో టైటిల్‌పై కన్నేసింది. తద్వారా 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలనుకుంటోంది. 2010లో ఆస్ట్రేలియా చివరిసారిగా అండర్ 19 ప్రపంచకప్ గెలిచింది. ఆ తర్వాత 2012, 2018లో ఫైనల్ చేరినా భారత్ చేతిలో ఓటమిపాలైంది. ఆసీస్ సైతం తాజా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు.

 How to watch India vs Australia U19 World Cup 2024 Final Match for Free?

ఫైనల్ వేదిక..?:
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్‌ మ్యాచ్ బెనోనిలోని విల్లోమోర్ పార్క్ మైదానంలో జరగనుంది. ఈ టోర్నీలోని రెండు సెమీఫైనల్లో ఈ మైదానంలోనే జరిగాయి.

ఫైనల్ టైమింగ్స్..:
భారత కాలమానం ప్రకారం అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.

ఫ్రీగా ఎలా చూడాలంటే..?:

అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ బీసీసీఐ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది. డీస్నీ హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌‌లోనూ ఈ మ్యాచ్ రానుంది. హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ను ఫ్రీగా వీక్షించవచ్చు.

భారత జట్టు: అర్షిణి కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్రా మయుర్ పటేల్, సచిన్ ధాస్, ప్రియాన్ష్ మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ శరణ్(కెప్టెన్), అరవెల్లి అవనిష్ రావు, సౌమీ పాండే, మురుగణ్ అభిషేక్, ఇన్నేష్ మహజన్, ధనుష్ గౌడ, ఆరధ్యా శుక్లా, రాజ్ లింబాని, నమన్ తీవారి

ఆస్ట్రేలియా జట్టు: హ్యూ వీబ్‌గెన్ (కెప్టెన్), లాచ్‌లాన్ ఐట్‌కెన్, చార్లీ ఆండర్సన్, హర్కీరత్ బజ్వా, మహ్లీ బార్డ్‌మన్, టామ్ కాంప్‌బెల్, హ్యారీ డిక్సన్, ర్యాన్ హిక్స్, సామ్ కాన్స్టాస్, రాఫెల్ మాక్‌మిలన్, ఐడాన్ ఓ'కానర్, హర్జాస్ సింగ్, టామ్ స్ట్రాకర్, కల్లమ్ పెకెలర్, ఓల్లీ.

Story first published: Saturday, February 10, 2024, 19:30 [IST]
Other articles published on Feb 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+