Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia మ్యాచ్‌లు ఫ్రీగా చూడాలంటే ఏం చేయాలంటే..?

How to watch India vs Australia T20I Series for free

హైదరాబాద్: ఆసియాకప్ 2022 వైఫల్యం అనంతరం టీమిండియా మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా వచ్చే మంగళవారం(సెప్టెంబర్ 20)న తొలి మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచకప్‌నకు ముందు బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్‌ను సెట్‌ను చేసుకోవడానికి భారత్‌కు మంచి తరుణం. సీనియర్‌ పేసర్‌ జ‌స్‌ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకొని వచ్చాడు.

మూడు ఆప్షన్స్‌తో..

మూడు ఆప్షన్స్‌తో..

అలాగే యువ బౌలర్‌ హర్షల్‌ పటేల్ కూడా జట్టుతో చేరాడు. వీరిద్దరూ టీ20 ప్రపంచకప్‌ జట్టులోనూ ఉన్నారు. దీంతో చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగుతున్న బుమ్రా, పటేల్ ఎలా రాణిస్తారనేది వేచి చూడాలి. ప్రపంచకప్‌ నాటికి బౌలింగ్‌ లయను అందుకోవాలని భారత్ ఆశిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లు అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌, డిస్నీహాట్‌సార్ట్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. డబ్బులు చెల్లించే స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఓ మూడు పద్దతుల ద్వారా మ్యాచ్‌లను ఫ్రీ చూడవచ్చు.

1. మొబైల్ రిచార్జ్ ప్లాన్స్‌తో..

1. మొబైల్ రిచార్జ్ ప్లాన్స్‌తో..

మాములుగా మనం చేసుకునే మొబైల్ రిచార్జ్ ప్లాన్స్ ద్వారా హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. జియో, ఎయిర్టెల్, వీఐ యూజర్లకు చాలా ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. మొబైల్ వాడకం కోసం మాములుగా చేసుకునే రిచార్జ్ ప్లాన్స్ కంటే కొంచెం అదనంగా చెల్లించి ప్లాన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

2. జియో టీవీ..

2. జియో టీవీ..

ఇక జియో టీవీ యాప్ ద్వారా కూడా భారత్ X ఆస్ట్రేలియా మ్యాచ్‌లను ఫ్రీగా చూడవచ్చు. జియో టీవీ యాప్‌లో స్టార్ స్పోర్ట్స్ అని సెర్చ్ చేసి మ్యాచ్‌ను వీక్షించవచ్చు. అయితే ఇది జియో టీవీ యూజర్లకు మాత్రమే.

3.డీడీ స్పోర్ట్స్‌లో..

3.డీడీ స్పోర్ట్స్‌లో..

కేంద్ర ప్రభుత్వానికి చెందిన దూరదర్శన్ స్పోర్ట్స్ చానెల్‌లో కూడా ఈ మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి. ఈ చానెల్‌ను టీవీలో ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఫ్రీగా చూడవచ్చు.

షెడ్యూల్‌ ఇదే..

షెడ్యూల్‌ ఇదే..

భారత్‌ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టీ20లు జరుగుతాయి. తొలి మ్యాచ్ సెప్టెంబర్ 20 (మంగళవారం) మొహాలీ వేదికగా జరుగుతుంది. అలాగే రెండో టీ20 మ్యాచ్‌ నాగ్‌పుర్ వేదికగా సెప్టెంబర్ 23 (శుక్రవారం), చివరి టీ20 హైదరాబాద్‌ వేదికగా సెప్టెంబర్ 25 (ఆదివారం)న జరగనుంది. ప్రతి మ్యాచ్‌ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. స్టార్‌స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో వీక్షించే అవకాశం ఉంది.

జట్ల వివరాలు

జట్ల వివరాలు

భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్, దినేశ్‌ కార్తిక్, హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్‌ యాదవ్, బుమ్రా, దీపక్ చాహర్, హర్షల్‌ పటేల్

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్‌ (కెప్టెన్), సీన్ అబాట్, ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్‌ హేజిల్‌వుడ్, జోష్ ఇగ్లిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, డానియల్ సామ్స్, స్టీవ్‌ స్మిత్, మ్యాథ్యూ వేడ్, ఆడమ్ జంపా

Story first published: Monday, September 19, 2022, 15:24 [IST]
Other articles published on Sep 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+