For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AUS పింక్ బాల్ టెస్ట్ టైమింగ్స్.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?

ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా.. మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న డై/నైట్ టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌‌లో సమష్టిగా రాణించి 295 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయాన్నందుకుంది.

ఆ మ్యాచ్ తరహాలోనే ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో విజయం సాధించి ఈ సిరీస్‌లో తమ ఆధిక్యాన్ని 2-0తో డబుల్ చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. తద్వారా ఆసీస్ గడ్డపై హ్యాట్రిక్ సిరీస్ కైవసం చేసుకోవాలనే లక్ష్యానికి బాటలు వేసుకోవాలనుకుంటోంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది.

How to Watch India vs Australia Pink Ball Test For Free

ఆసీస్ ప్రధాని ఎలెవన్‌తో రెండు రోజుల పింక్ బాల్ సన్నాహక మ్యాచ్ కూడా ఆడింది. టెస్ట్ క్రికెట్‌ చరిత్రలోనే భారత్‌కు ఇది ఐదో పింక్ బాల్ టెస్ట్ మాత్రమే. గతంలో నాలుగు పింక్ బాల్ మ్యాచ్‌లు ఆడిన టీమిండియా మూడింటిలో గెలిచి ఒక్కదాంట్లో ఓటమిపాలైంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది.

జియోసినిమాలో రాదు..
ఈ ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్‌కు చెందిన ఛానెల్స్‌తో పాటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. స్టార్ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ హెచ్‌డీ ఛానెల్లతో పాటు స్టార్ స్పోర్ట్స్ 4 తెలుగు, మళయాళం, కన్నడ వంటి స్థానిక భాషాల్లోనూ లైవ్ రానుంది.

అయితే ఈ ఛానెల్స్‌ను సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. హాట్ స్టార్‌లో కూడా ఈ సిరీస్ ఫ్రీగా రాదు. డబ్బులు చెల్లించాల్సిందే. జియోసినిమాలో ఫ్రీగా మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చేస్తుండటంతో హాట్ స్టార్ కూడా దిగొచ్చి కొన్నిరోజులు ఫ్రీగా లైవ్ ఇచ్చింది. కానీ గత కొన్ని రోజులుగా హాట్ స్టార్ ఫ్రీగా మ్యాచ్‌లు ప్రసారం చేయడంలేదు. దాంతో అందరూ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి వచ్చింది.

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..
భారత క్రికెట్ అభిమానుల కోసం కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించిన మ్యాచ్‌లను కేంద్ర ప్రభుత్వానికి చెందిన డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని వెల్లడించింది. ఈ ఛానెల్‌ను ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఫ్రీగా చూడవచ్చు. పింక్ బాల్ మ్యాచ్‌ను కూడా ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (ఉదయం 7.30)
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు)

భారత జట్టు: యశస్వీ జైస్వాల్, శుభ్‌‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్‌ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్.

పింక్ బాల్ టెస్ట్‌కు భారత తుది జట్టు(అంచనా):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్(కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా

Story first published: Wednesday, December 4, 2024, 20:43 [IST]
Other articles published on Dec 4, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+