Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Afghanistan టీ20 సిరీస్.. హాట్‌స్టార్‌లో రాదు! ఎలా చూడాలంటే? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే!

సౌతాఫ్రికా పర్యటనను విజయంతో ముగించిన టీమిండియా.. సొంతగడ్డపై మరో సిరీస్‌కు సన్నదమైంది. జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ ఏడాది జూన్‌లో అగ్రరాజ్యం అమెరికా వేదికగా ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీకి ముందు టీమిండియా ఆడనున్న ఏకైక పొట్టి సిరీస్ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సిరీస్ బరిలోకి దిగే భారత జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆదివారమే ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన వివరాలను వెల్లడించింది. ఊహించనట్లుగానే గత 14 నెలలుగా పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ‌లు ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. టీ20 ప్రపంచకప్ 2024 ప్రణాళికల్లో ఈ ఇద్దరూ ఆటగాళ్లు ఉన్నారని బీసీసీఐ ఈ ఎంపిక ద్వారా స్పష్టం చేసింది.

How to watch India vs Afghanistan T20I series live on tv and online

కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వగా.. గాయాల బారిన పడిన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, మహమ్మద్ షమీలు ఈ సిరీస్‌కు కూడా దూరమయ్యారు. మానసిక సమస్యలతో సౌతాఫ్రికా పర్యటన నుంచి బ్రేక్ తీసుకున్న ఇషాన్ కిషన్‌‌ ఈ సిరీస్‌కూ దూరంగా ఉన్నాడు.

ఇక ఇండియా వర్సెస్ అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకే ప్రారంభం కానున్నాయి. జనవరి 11 మొహాలి వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. జనవరి 14న ఇండోర్‌లో రెండో టీ20, జనవరి 17న బెంగళూరు వేదికగా మూడో టీ20 జరగనుంది.

ఈ సిరీస్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ వయోకామ్ సంస్థకు చెందిన స్పోర్ట్స్ 18 ఛానెల్‌కు ఉన్నాయి. స్పోర్ట్స్ 18 ఛానెల్‌లో ఈ మ్యాచ్‌లు జరగనుండగా.. జియో సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ఫ్రీగా మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్

అఫ్గానిస్థాన్‌ జట్టు:
ఇబ్రహీమ్ జడ్రాన్(కెప్టెన్), రషీద్ ఖాన్, గుర్బాజ్, హజాయ్, అలిఖిల్, రెహ్మాత్ షా, మహమ్మద్ నబీ, జడ్రాన్, జనత్, ఓమార్జాయ్, అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజలక్ ఫరూఖీ, మాలిక్, నవీన్ ఉల్ హక్, అహ్మద్, సలీమ్, అహ్మద్,నైబ్, రషీద్ ఖాన్

Story first published: Monday, January 8, 2024, 17:00 [IST]
Other articles published on Jan 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+