అండర్ 19 వరల్డ్‌కప్ 2026 రంగం సిద్దమైంది. సౌతాఫ్రికా వేదికగా మరికొద్ది గంటల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. గురువారం జరిగే తొలి మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత కుర్రాళ్ల జట్టు అమెరికా అండర్ 19 టీమ్‌తో తలపడనుంది. అమెరికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో గ్రూప్-బీలో భారత్‌తో ఉంది. సౌతాఫ్రికాతో యూత్ వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత కుర్రాళ్ల జట్టు సూపర్ ఫామ్‌లో ఉంది.
అండర్ 19 ప్రపంచకప్ వామప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా.. భారత్‌కు వచ్చే సమస్య లేదు. విధ్వంసకర బ్యాటర్, టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ భారత జట్టుకు కీలకం కానున్నాడు. అతనితో పాటు విహాన్ మల్హోత్ర, అభిజ్ఞాన్ కుందు, ఆయుష్ మాత్రేలతో భారత బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. ఆయుష్ మాత్రే ఫామ్‌లో లేకపోవడం టీమిండియాను కలవరపెడుతుంది. కానీ మెగా టోర్నీలో అతను టచ్‌లోకి వస్తాడని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

భారత కాలమానం ప్రకారం భారత్, అమెరికా మ్యాచ్ గురువారం మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్ అధికార బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. ఈ రెండు వేదికల్లో మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ఫ్రీగా చూడాలంటే ప్రత్యేకమైన మొబైల్ రిఛార్జ్ ప్లాన్స్‌తో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీగా పొందవచ్చు.
భారత్: ఆయుష్ మ్హత్రే (కెప్టెన్), ఆర్.ఎస్. అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, డి. దీపేష్, మొహమ్మద్ ఎనాన్, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు, కిషన్ కుమార్ సింగ్, విహాన్ మల్హోత్రా, ఉధవ్ మోహన్, హెనిల్ పటేల్, ఖిలన్ ఎ. పటేల్, హర్వంత్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది.
అమెరికా (USA): ఉత్కర్ష్ శ్రీవాస్తవ (కెప్టెన్), అద్నిత్ ఝామ్, శివ్ శని, నితీష్ సుదిని, అద్వైత్ కృష్ణ, సాహిర్ భాటియా, అర్జున్ మహేష్, అమ్రీందర్ గిల్, సబ్రీష్ ప్రసాద్, అదిత్ కప్పా, సాహిల్ గార్గ్, అమోఘ్ రెడ్డి అరేపల్లి, రిత్విక్ అప్పిడి, రాయన్ తాజ్, రిషబ్ షింపి.