For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Duleep Trophy 2025 ఫ్రీగా ఎలా చూడాలంటే.. పూర్తి షెడ్యూల్ ఇదే

ఇంగ్లండ్ పర్యటనను విజయంతో ముగించిన టీమిండియా.. సెప్టెంబర్ 9న ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025తో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ గ్యాప్‌లో భారత ఆటగాళ్లు ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో బరిలోకి దిగనున్నారు. ఈ టోర్నీతోనే ఈ సీజన్ దేశవాళీ క్రికెట్ ప్రారంభం కానుంది. ఈ సారి జోనల్ ఫార్మాట్‌లోనే దులీప్ ట్రోఫీ నిర్వహిస్తున్నారు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటన కోసం దులీప్ ట్రోఫీ ఫార్మాట్‌ను మార్చిన విషయం తెలిసిందే. భారత సీనియర్ ఆటగాళ్లను నాలుగు టీమ్స్‌గా విభజించి ఈ టోర్నీని ఆడించారు. ఈ సారి మాత్రం పాత పద్దతిలోనే ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఈ ఫస్ట్ క్లాస్ టోర్నీలో టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీలు బరిలోకి దిగుతున్నారు.

ఫార్మాట్ ఏంటంటే..?

ఈ టోర్నీ‌లో సౌత్, నార్త్, వెస్ట్, ఈస్ట్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్స్‌కు చెందిన 6 జట్లు తలపడుతున్నాయి. గత ఎడిషన్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచిన సౌత్ జోన్, వెస్ట్ జోన్ నేరుగా సెమీఫైనల్స్ ఆడనుండగా.. మిగతా నాలుగు జట్లు అయిన సెంట్రల్, ఈస్ట్, నార్త్, నార్త్ ఈస్ట్ జోన్స్ క్వార్టర్ ఫైనల్ రౌండ్ ఆడుతాయి. ఇందులోని రెండు జట్లు సెమీఫైనల్-2కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్లో గెలిచిన జట్లు ఫైనల్లో తలపడుతాయి. సౌత్ జోన్‌కు తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికవ్వగా.. వెస్ట్ జోన్‌కు ఇషాన్ కిషన్ సారథ్యం వహించనున్నాడు. వెస్ట్ జోన్‌కు శార్దూల్ ఠాకూర్, నార్త్ జోన్‌కు శుభ్‌మన్ గిల్, సెంట్రల్ జోన్‌కు ధ్రువ్ జురెల్, నార్త్ ఈస్ట్ జోన్‌కు జోనాథన్ రోంగ్సెన్ సారథ్యం వహించనున్నారు. ఆసియా కప్‌ 2025 ఎంపికయ్యే ఆటగాళ్లు దులీప్ ట్రోఫీ సెమీస్, ఫైనల్ మ్యాచ్‌కు దూరమవుతారు. మ్యాచ్‌లు అన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

How to Watch Duleep Trophy 2025 for Free Full Schedule and Squads

పూర్తి షెడ్యూల్

క్వార్టర్-ఫైనల్ 1: ఆగస్టు 28-31, 2025: నార్త్ జోన్ vs ఈస్ట్ జోన్

క్వార్టర్-ఫైనల్ 2: ఆగస్టు 28-31, 2025: సెంట్రల్ జోన్ vs నార్త్ ఈస్ట్ జోన్

సెమీ-ఫైనల్ 1: సెప్టెంబర్ 4-7, 2025: సౌత్ జోన్ vs క్వార్టర్-ఫైనల్ 1 విజేత

సెమీ-ఫైనల్ 2: సెప్టెంబర్ 4-7, 2025: నార్త్ జోన్ vs క్వార్టర్-ఫైనల్ 2 విజేత

ఫైనల్: సెప్టెంబర్ 11-15, 2025: సెమీ-ఫైనల్ 1 విజేత vs సెమీ-ఫైనల్ 2 విజేత

ఫ్రీగా ఎలా చూడాలంటే..?

దులీప్ ట్రోఫీకి స్పోర్ట్స్ 18 ఛానెల్, జియో హాట్‌స్టార్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్నాయి. స్పోర్ట్స్ 18 ఛానెల్‌తో పాటు జియో హాట్ స్టార్‌ను సబ్‌స్ట్రైబ్ చేసుకోవాలి. ఫ్రీగా చూడాలంటే జియో యూజర్లు 5జీ నెట్ వర్క్ ప్లాన్స్‌ను రిఛార్జ్ చేసుకుంటే హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తోంది.

జట్ల వివరాలు..

సౌత్ జోన్: తిలక్ వర్మ (కెప్టెన్), మహమ్మద్ అజారుద్దీన్ (వైస్-కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, దేవదత్ పడిక్కల్, మోహిత్ కాలే, సల్మాన్ నిజార్, నారాయణ్ జగదీశన్, త్రిపురనా విజయ్, ఆర్ సాయి కిషోర్, తనయ్ త్యాగరాజన్, విజయ్ కుమార్ వైశాక్, నిధీష్ ఎండి, రికీ భుయ్, బాసిల్ ఎన్పీ, గుర్జప్నీత్ సింగ్, స్నేహల్ కౌతంకర్. (స్టాండ్‌బైస్: మోహిత్ రెడ్కర్, ఆర్ స్మరణ్, అంకిత్ శర్మ, ఎడెన్ ఆపిల్ టామ్, ఆండ్రే సిద్ధార్థ్, షేక్ రషీద్)

ఈస్ట్ జోన్: ఇషాన్ కిషన్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్ (వైస్-కెప్టెన్), సందీప్ పట్నాయక్, విరాట్ సింగ్, డెనిష్ దాస్, శ్రీదామ్ పాల్, శరణ్‌దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనిషి, సూరజ్ సింధు జైస్వాల్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, మహమ్మద్ షమీ. (స్టాండ్‌బైస్: ముఖ్తార్ హుస్సేన్, ఆశీర్వాద్ స్వైన్, వైభవ్ సూర్యవంశీ, స్వస్తిక్ సమల్, సుదీప్ కేఆర్ ఘరామీ, రాహుల్ సింగ్)

వెస్ట్ జోన్: శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఆర్య దేశాయ్, హర్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, జయ్‌మీత్ పటేల్, మనన్ హింగ్రాజియా, సౌరభ్ నవలే (వికెట్ కీపర్), షామ్స్ ములానీ, తనుష్ కొటియన్, ధర్మంద్రసింగ్ జడేజా, తుషార్ దేశ్‌పాండే, అర్జాన్ నాగ్వాస్‌వాలా. (స్టాండ్‌బైస్: మహేష్ పితియా, శివాలిక్ శర్మ, ముఖేష్ చౌదరి, సిద్ధార్థ్ దేశాయ్, చింతన్ గజా, ఉర్విల్ పటేల్, ముషీర్ ఖాన్)

నార్త్ జోన్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శుభమ్ ఖజురియా, అంకిత్ కుమార్ (వైస్-కెప్టెన్), ఆయుష్ బదోని, యశ్ ధుల్, అంకిత్ కల్సీ, నిశాంత్ సంధు, సాహిల్ లోత్రా, మయాంక్ డాగర్, యుధ్‌వీర్ సింగ్ చరక్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, అన్షుల్ కంబోజ్, ఆకిబ్ నబీ, కన్హైయా వధావన్. (స్టాండ్‌బైస్: శుభమ్ అరోరా (వికెట్ కీపర్), జస్కరణ్‌వీర్ సింగ్ పాల్, రవి చౌహాన్, అబిద్ ముష్తాక్, నిషుంక్ బిర్లా, ఉమర్ నజీర్, దివేశ్ శర్మ)

సెంట్రల్ జోన్: ధ్రువ్ జురెల్ (కెప్టెన్/వికెట్ కీపర్), రజత్ పాటిదార్, ఆర్యన్ జుయల్, డానిష్ మలేవార్, సంజీత్ దేశాయ్, కుల్దీప్ యాదవ్, ఆదిత్య ఠాక్రే, దీపక్ చాహర్, సరాన్ష్ జైన్, ఆయుష్ పాండే, శుభమ్ శర్మ, యశ్ రాఠోడ్, హర్ష్ దూబే, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్. (స్టాండ్‌బైస్: మాధవ్ కౌశిక్, యశ్ ఠాకూర్, యువరాజ్ చౌదరి, మహిపాల్ లోమ్రోర్, కుల్దీప్ సేన్, ఉపేంద్ర యాదవ్)

నార్త్ ఈస్ట్ జోన్: జొనాథన్ రోంగ్‌సెన్ (కెప్టెన్), ఆకాష్ కుమార్ చౌధరి, టెచి డోరియా, యుమ్నుం కర్ణజిత్, సెడెజాలీ రూపెరో, ఆశిష్ థాపా, హేమ్ బహదూర్ చెత్రి, జెహు ఆండర్సన్, అర్పిత్ సుభాష్ భతేవరా, ఫెరోయిజాం జోటిన్ సింగ్, పల్జోర్ తమంగ్, అంకుర్ మాలిక్, బిశ్వర్‌జిత్ సింగ్ కొన్తౌజాం, ఆర్యన్ బోరా, లంబాబాం అజయ్ సింగ్. (స్టాండ్‌బైస్: కమ్షా యాంగ్ఫో, రాజ్‌కుమార్ రెక్స్ సింగ్, బాబీ జోథన్సంగా, డిప్పు సంగమా, పుఖ్రంబాం ప్రఫుల్మణి సింగ్, లీ యోంగ్ లెప్చా, ఇమ్లివాటి లెమ్‌టూర్)

Story first published: Friday, August 15, 2025, 16:02 [IST]
Other articles published on Aug 15, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+