For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Duleep Trophy 2024: ఫ్రీగా ఎలా చూడాలంటే..?

ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5 నుంచి బెంగళూరు, అనంతపురం వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీతోనే భారత దేశవాళీ క్రికెట్ సీజన్‌కు తెరలేవనుంది. ఈ టోర్నీ సంప్రదాయానికి భిన్నంగా అగ్రశ్రేణి క్రికెటర్లతో ఎంపిక చేసిన నాలుగు జట్లు పోటీపడుతున్నాయి.
ప్రతీ ఏడాది జరిగే దులీప్ ట్రోఫీ, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్స్‌లు తలపడుతాయి. కానీ ఈసారి భారత అగ్రశ్రేణి ఆటగాళ్లతో ఏ,బీ,సీ, డీ జట్లను సెలెక్టర్లు ప్రకటించారు. వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుండటంతో రెడ్ బాల్ క్రికెట్‌కు కుర్రాళ్లను సంసిద్దం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రోహిత్, కోహ్లీ ఆడుతారని ప్రచారం జరిగినా.. వారితో పాటు అశ్విన్, బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్‌ల సారథ్యంలోని నాలుగు జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది.

How to watch Duleep trophy 2024 for free Schedule squads format IST timings

కొత్త ఫార్మాట్‌లో..
1961లో మొదలైన దులీప్ ట్రోఫీ ఇప్పటి వరకు ఆరు జట్లతో జోనల్ ఫార్మాట్‌లో జరిగేది. అయితే ఈసారి నాలుగు జట్లతో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ టోర్నీని ఎలాంటి నాకౌట్ మ్యాచ్‌లు లేకుండా రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరపనున్నారు. ప్రతీ జట్టు తమ ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.

అన్ని మ్యాచ్‌లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు విజేతగా నిలుస్తోంది. ఒక్కో మ్యాచ్ నాలుగు రోజుల పాటు జరగనుంది. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు ఈ టోర్నీలోని ప్రదర్శన ఆధారంగానే జట్టును ఎంపిక చేస్తామని బీసీసీఐ ప్రకటించింది.

దులీప్ ట్రోఫీ షెడ్యూల్..
సెప్టెంబర్-5: టీమ్ ఏ వర్సెస్ టీమ్ బీ(చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు)

సెప్టెంబర్-5: టీమ్ సీ వర్సెస్ టీమ్ డీ(రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం ఏ, అనంతపురం)

సెప్టెంబర్-12: టీమ్ ఏ వర్సెస్ టీమ్ డీ(రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం ఏ, అనంతపురం)

సెప్టెంబర్-12: టీమ్ బీ వర్సెస్ టీమ్ సీ(రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం బీ, అనంతపురం)

సెప్టెంబర్-19: టీమ్ బీ వర్సెస్ టీమ్ డీ(రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం బీ, అనంతపురం)

సెప్టెంబర్-19: టీమ్ ఏ వర్సెస్ టీమ్ సీ(రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం ఏ, అనంతపురం)

ఫ్రీగా చూడాలంటే..?
దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు అధికారిక బ్రాడ్ కాస్టర్ స్పోర్ట్స్ 18, జియోసినిమాలో ప్రత్యక్షప్రసారం కానున్నాయి. జియోసినిమాలో ఈ మ్యాచ్‌లను ఫ్రీగా చూడవచ్చు. టీమిండియా హోమ్ సీజన్ మ్యాచ్‌ల బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను జియోసినిమా, స్పోర్ట్స్ 18 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

బరిలోకి దిగే నాలుగు జట్లు..
టీమ్ ఏ: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కోటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్ర, శస్వాత్ రావత్.

టీమ్ బీ: అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవాస్థి, ఎన్ జగదీషన్(కీపర్).

టీమ్ సీ: రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటీదార్, రజత్ పటీదార్, అభిషేక్ ఫోరల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, బీ ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మనవ్ సుథార్, ఉమ్రాన్ మాలిక్, వైశాఖ్ విజయ్‌కుమార్, అన్షుల్ కంబోజి, హిమాన్ష చౌహన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్, సందీప్ వారియర్.

టీమ్ డీ: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ టైడ్, యశ్ దుబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, రికీ భుయ్, సరాన్ష్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాక్రే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సెంగుప్తా, కేఎస్ భరత్, సౌరభ్ కుమార్.

Story first published: Thursday, August 15, 2024, 19:09 [IST]
Other articles published on Aug 15, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+