Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final ఫ్రీగా ఎలా చూడాలంటే..?

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 తుది సమరానికి సమయం ఆసన్నమైంది. మరో 24 గంటల్లో క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానం వేదికగా ఈ బిగ్ మ్యాచ్‌కు తెరలేవనుంది. గత రెండెళ్లుగా సాగిన ఈ ఛాంపియన్‌షిప్‌లో టాప్-2లో నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఈ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు ఇంగ్లండ్ చేరి ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. జూన్ 11 నుంచి 15 వరకు జరిగే ఈ మ్యాచ్‌కు జూన్ 16ను రిజర్వ్ డేగా కేటాయించారు.

వర్షం లేదా ఇతర కారణాల వల్ల నష్టపోయిన ఆటను రిజర్వ్ డే రోజు ఆడిస్తారు. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో భారత్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా.. వరుసగా రెండో టైటిల్ గెలవడంపై ఫోకస్ పెట్టింది. మరోవైపు తొలిసారి ఫైనల్ చేరిన సౌతాఫ్రికా మొట్ట మొదటి ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

How to Watch Australia vs South Africa WTC Final For Free Lord s Pitch and Weather Report

లార్డ్స్ పిచ్ రిపోర్ట్..

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఏర్పాటు చేసిన లార్డ్స్ పిచ్ పొడిగా ఉంది. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ స్పిన్నర్లకు సహకరించనుంది. పిచ్‌పై పచ్చదనం ఉన్న నేపథ్యంలో ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మైదానాన్ని మబ్బులు కమ్మేస్తే పేసర్లు.. స్వింగ్‌తో చెలరేగనున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్‌కు డ్యూక్ బాల్స్ ఉపయోగిస్తారు. ఈ బంతితో స్వింగ్ ఎక్కువగా ఉంటుంది. పిచ్‌పై పచ్చదనం ఉండటంతో పాటు మైదానాన్ని మబ్బులు కమ్మెస్తే టాస్ గెలిచిన కెప్టెన్‌గా బౌలింగ్ ఎంచుకుంటాడు. అలా కాకుండా వాతావరణం వెచ్చగా ఉంటే మాత్రం బ్యాటింగ్‌కు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో చివరి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.

వెదర్ రిపోర్ట్..

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం ముప్పు లేదు. వర్షం పడే అవకాశాలు 8 శాతం మాత్రమే ఉన్నాయి. ఐదు రోజుల పాటు ఆట సజావుగా సాగనుంది. ఒకవేళ వర్షంతో అంతరాయం కలిగినా.. రిజర్వ్ డే ఉంది. వాతావరణం వేడిగా ఉంటే మాత్రం స్పిన్నర్లు కీలకంగా మారనున్నారు. చల్లగా ఉంటే సీమర్లు చెలరేగుతారు.

ఫ్రీగా ఎలా చూడాలంటే..?

భారత కాలమానం ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్‌లో ఈ మ్యాచ్‌ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్‌తో పాటు జియో‌హాట్‌స్టార్‌ సొంతం చేసుకున్నాయి. స్టార్ స్పోర్ట్స్ సంబంధిత ఛానెల్స్‌తో పాటు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వేదిక జియో హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌‌ను చూడవచ్చు. అయితే ఈ మ్యాచ్‌‌ను ఉచితంగా చూసే అవకాశం లేదు. జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్‌లు భాగస్వాములగా మారి సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశ పెట్టారు. దాంతో ఉచితంగా చూసే అవకాశం లేకుండా పోయింది. అయితే జియో సిమ్ యూజర్లు ప్రత్యేకమైన రిఛార్జ్ ప్లాన్‌తో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.

తుది జట్లు(అంచనా)

ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా , మార్నస్ లబుషేన్, కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లయన్.

సౌతాఫ్రికా: ఎయిడెన్ మార్క్‌రమ్, ర్యాలీ రికెల్టన్, టోనీ డి జార్జి, టెంబా బవుమా, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడా, లుంగి ఎంగిడి.

Story first published: Tuesday, June 10, 2025, 12:53 [IST]
Other articles published on Jun 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+