ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ఈ మెగా సిరీస్‌కు తెరలేవనుంది. బజ్‌బాల్ గేమ్‌తో ఇంగ్లండ్.. రాజీపడని ఆటతో ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమయ్యాయి. ఇది కేవలం ఐదు టెస్ట్‌ల సిరీస్ కాదు.. ఇరు దేశాల మధ్య పరోక్ష యుద్ధం.. తరాల నాటి వైరాగ్యం. అత్యుత్తమ జట్ల మధ్య పోరుకు నిదర్శనం.
ఈ సిరీస్‌లో ప్రతి బంతి ఓ చరిత్రను లిఖిస్తే.. ప్రతీ వికెట్‌తో అభిమానులు ఉక్కిరిబిక్కిరవుతారు. ఇంగ్లండ్ ఈ సారైనా యాషెస్‌ను తిరిగి గెలవాలని చూస్తుంటే.. ఆస్ట్రేలియా తమ దశాబ్దాల ఆధిపత్యాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మొత్తానికి ఈ సిరీస్ క్రికెట్ అభిమానులకు కావాల్సిన మజాను అందించనుంది.

పెర్త్ వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.50 గంటలకు మొదలవ్వనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన మ్యాచ్‌లు భారత్‌లో స్టార్ స్పోర్ట్స్‌తో పాటు ఓటీటీ వేదికైన జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ వేదికలుగా మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. అయితే ప్రత్యేక మొబైల్ రిఛార్జ్ ప్లాన్స్‌తో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.
తొలి టెస్ట్:( నవంబర్ 21-25) పెర్త్ వేదికగా, భారత కాలమానం ప్రకారం ఉదయం 7.50 గంటలకు
రెండో టెస్ట్ (పింక్ బాల్):(డిసెంబర్ 04-08): బ్రిస్బేన్ వేదికగా, భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు
మూడో టెస్ట్(డిసెంబర్ 17-21): అడిలైడ్ వేదికగా, భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు
నాలుగో టెస్ట్(డిసెంబర్ 26-30): మెల్‌బోర్న్ వేదికగా, భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు
ఐదో టెస్ట్(2026 జనవరి 4-08): సిడ్నీ వేదికగా, భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు
ఇరు జట్లు:
ఆస్ట్రేలియా:
ఉస్మాన్ ఖవాజా, జేక్ వెదర్‌ఆల్డ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, బ్రెండన్ డోగెట్, స్కాట్ బోలాండ్, నాథన్ లియోన్.
ఇంగ్లండ్:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), మార్క్ వుడ్.