పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ టీమ్.. మరో టోర్నీలో సత్తా చాటేందుకు సిద్దమవుతోంది. సెప్టెంబర్ 8 నుంచి 17 వరకు చైనా వేదికగా పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో హర్మన్ సేన ఈ టోర్నీ బరిలోకి దిగుతుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును హాకీ ఇండియా ప్రకటించింది.
ఈ జట్టులో పలువురు కొత్త ఆటగాళ్లు అవకాశం దక్కించుకున్నారు. సీనియర్ ప్లేయర్స్ అయిన మన్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ, హార్దిక్ సింగ్‌లకు ఈ టోర్నీ నుంచి విశ్రాంతినిచ్చారు. పారిస్ ఒలింపిక్స్‌తో వీడ్కోలు కలిపిన స్టార్ గోల్ కీపర్ శ్రీజేశ్ స్థానంలో క్రిషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరాలు ఎంపికయ్యారు.

పారిస్ ఒలింపిక్స్‌లో ఆడిన జట్టులోని 10 మంది ఆటగాళ్లకు ఈ టోర్నీకి ఎంపికయ్యారు. ఈ టోర్నీలో ఆతిథ్య చైనాతో పాటు భారత్, పాకిస్థాన్, మలేషియా, సౌత్ కొరియా, జపాన్‌లు పాల్గొననున్నాయి. సెప్టెంబర్ 8న చైనాతో జరిగే తొలి మ్యాచ్‌తో భారత్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది.
సెప్టెంబర్ 9న జపాన్‌తో, సెప్టెంబర్ 11న మలేషియాతో, 12న కొరియాతో, 14న పాకిస్థాన్‌తో తలపడనుంది. సెప్టెంబర్ 17న ఫైనల్ జరగనుంది.
వరుసగా రెండు ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ రెండు కాంస్యా పతకాలు సాధించడంతో జనాలకు మళ్లీ ఈ ఆటపై ఆసక్తి పెరిగింది. హాకీ మ్యాచ్‌లను చూసేందుకు క్రీడాభిమానులు ఆసక్తి చూపుతున్నారు.
ఫ్రీగా ఎలా చూడాలంటే..
ఈ టోర్నీకి అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా సోనీ స్పోర్ట్స్ ఛానెల్ వ్యవహరిస్తోంది. సోనీ టెన్-1,2,3, 4 చానెల్స్‌తో పాటు భాషా చానెల్స్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్షం ప్రసారం కానున్నాయి. సోనీ నెట్‌వర్క్‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లైవ్ యాప్‌లో కూడా మ్యాచ్‌లు రానున్నాయి. ఫ్రీగా చూడాలనుకుంటే జియో టీవీ యాప్‌లో సోనీ టెన్ ఛానెల్స్‌ను సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. యూట్యూబ్ వేదికగా సోనీ చానెల్స్‌లో హైలైట్స్ వీక్షించవచ్చు.
షెడ్యూల్:
సెప్టెంబర్ 8:
1. కొరియా vs జపాన్ (ఉదయం 11 గంటలకు)
2. మలేషియా vs పాకిస్తాన్ (మధ్యాహ్నం 1:15 గంటలకు)
3. భారత్ vs చైనా( మధ్యాహ్నం 3:30)
సెప్టెంబర్ 9:
1. కొరియా vs పాకిస్థాన్( ఉదయం 11 గంటలకు)
2. భారత్ vs జపాన్( మధ్యాహ్నం 1:15 గంటలకు)
3. చైనా vs మలేషియా( మధ్యాహ్నం 3:30)
సెప్టెంబర్ 11:
1. పాకిస్థాన్ vs జపాన్( ఉదయం 11 గంటలకు)
2. భారత్ vs మలేషియా (మధ్యాహ్నం 1:15 గంటలకు)
3. చైనా vs కొరియా( మధ్యాహ్నం 3:30 గంటలకు)
సెప్టెంబర్ 12:
1.జపాన్ vs మలేషియా( ఉదయం 11గంటలకు)
2. భారత్ vs కొరియా( మధ్యాహ్నం 1:15 గంటలకు)
3. పాకిస్థాన్ vs చైనా( మధ్యాహ్నం 3:30 గంటలకు)
సెప్టెంబర్ 14
1. మలేషియా vs కొరియా( ఉదయం 11 గంటలకు)
2. భారత్ vs పాకిస్థాన్(మధ్యాహ్నం 1:15 గంటలకు)
3. జపాన్ vs చైనా( మధ్యాహ్నం 3:30 గంటలకు)
సెప్టెంబర్ 16
1. 5వ-6వ స్థానం ప్లే-ఆఫ్( 10:30 గంటలకు)
2. సెమీ-ఫైనల్ 1(మధ్యాహ్నం 1గంటలకు)
3.సెమీ-ఫైనల్ 2( మధ్యాహ్నం 3:30 గంటలకు)
సెప్టెంబర్ 17
1. థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్( మధ్యాహ్నం 1గంటలకు)
2. ఫైనల్(మధ్యాహ్నం 3:30 గంటలకు)
భారత జట్టు:
డిఫెండర్స్: జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), జుగ్‌రాజ్ సింగ్, సంజయ్, సుమిత్
మిడ్ ఫీల్డర్స్: రాజ్‌కుమార్ పాల్, నీలకంఠ శర్మ, వివేక్ సాగ్ ప్రసాద్(వైస్ కెప్టెన్), మహమ్మద్ రహీల్ మౌసీన్
గోల్ కీపర్స్: క్రిషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా.
ఫార్వర్డ్స్: అభిషేక్, సుఖ్‌జిత్ సింగ్, అరైజీత్ సింగ్ హుందాల్, ఉత్తమ్ సింగ్, గుర్జోత్ సింగ్.