Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2025 మ్యాచ్‌లు.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?

ఆసియా కప్ 2025 టోర్నీ రసవత్తర దశకు చేరింది. లీగ్ దశ ముగిసి సూపర్-4 పోరు ప్రారంభమైంది. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు సూపర్-4‌కు అర్హత సాధించాయి. ఇప్పటికే బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య సూపర్-4 మ్యాచ్‌ ముగిసింది. లీగ్ దశ మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగినా.. సూపర్-4 మ్యాచ్‌లు మాత్రం హోరాహోరీగా సాగనున్నాయి. శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్ విజయం సాధించింది. మరికాసేపట్లో భారత్, పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

అయితే ఈ టోర్నీకి సోనీ టీవీ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. సోనీ టీవీ ఛానెల్స్‌తో పాటు ఆ సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ సోనీ లివ్‌లో ఆసియా కప్ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

How to Watch Asia Cup 2025 Matches for Free on Jio

అయితే ఈ మ్యాచ్‌లను చూడాలంటే డబ్బులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోటీ టీవీ ఛానల్స్ లేదా సోనీ లివ్ యాప్‌ సబ్‌స్క్రైబ్ చేసుకుంటేనే మ్యాచ్‌లు చూడవచ్చు. అయితే ఆసియా కప్ 2025 మ్యాచ్‌లను ఫ్రీగా చూసే అవకాశం జియో యూజర్లకు ఉంది. ప్రత్యేక రిచార్జ్ ప్లాన్స్‌తో సోనీ లివ్ యాప్‌ను ఫ్రీగా సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆ ప్లాన్స్ వివరాల గురించి తెలుసుకుందాం.

  • జియో రూ. 445 తో రిచార్జ్ చేసుకుంటే 56 రోజుల పాటు ప్రతీ రోజు 2జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్ పొందవచ్చు. అంతేకాకుండా సోనీ లివ్‌తో పాటు జీ5 వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తోంది.
  • రూ. 175 రిచార్జ్‌తో 28 రోజుల పాటు 10జీబీ డాటాతో పాటు సోనీ లివ్‌తో పాటు 10 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు.
  • రూ. 1049 రిచార్జ్‌తో 84 రోజుల పాటు ప్రతీ రోజు 2జీబీ డాటాతో పాటు సోనీ లివ్‌, జీ5, జియోటీవీ ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు.

టీమిండియా సూపర్ 4 షెడ్యూల్

సెప్టెంబర్ 21 (ఆదివారం): భారత్ వర్సెస్ పాకిస్తాన్ - రాత్రి 7:30 గంటలకు, దుబాయ్.
సెప్టెంబర్ 24 (బుధవారం): భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ - రాత్రి 7:30 గంటలకు, దుబాయ్.
సెప్టెంబర్ 26 (శుక్రవారం): భారత్ వర్సెస్ శ్రీలంక - రాత్రి 7:30 గంటలకు, దుబాయ్.

Story first published: Sunday, September 21, 2025, 16:14 [IST]
Other articles published on Sep 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+