సింగిల్ తీద్దామని
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం రాత్రి వెస్టిండీస్, శ్రీలంక జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో విండీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే లంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్ గుణతిలక హాఫ్ సెంచరీ సాధించాక వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ వేసిన 21 ఓవర్ మొదటి బంతిని గుణతిలక డిఫెన్స్ చేశాడు. ఆ బంతి అతడి కాళ్ల వద్దే ఆగిపోవడంతో సింగిల్ తీద్దామని ముందుకెళ్లాడు. దాంతో బౌలింగ్ చేస్తున్న పొలార్డ్ వెంటనే స్పందించి రనౌట్ చేయడానికి దూసుకొచ్చాడు.
ఫీల్డింగ్‌కు అడ్డుగా వచ్చాడని
పొలార్డ్ బంతిని అందుకోవడం గమనించిన గుణతిలక మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ నిసంకను పరుగు కోసం రావొద్దని చెప్పాడు. ఈ సమయంలో గుణతిలక క్రీజులోకి వెళుతూ అనుకోకుండా బంతిని కాలితో తన్నాడు. అప్పటికే పొలార్డ్ రనౌట్ చేయడానికి బంతి దగ్గరికి రాగా.. గుణతిలక క్రీజులోకి వెళ్లిపోయాడు. దాంతో గుణతిలక తమ ఫీల్డింగ్‌కు అడ్డుగా వచ్చాడని విండీస్ కెప్టెన్ అంపైర్‌కు అప్పీల్ చేశాడు. దీంతో ఆన్‌ఫీల్డ్ అంపైర్ జో విల్సన్ సాఫ్ట్ సిగ్నల్‌గా ఔట్ అని ప్రకటించి మూడో అంపైర్ నిగెల్ గుగైడ్‌ని అడిగాడు. వీడియోను వివిధ కోణాల్లో పరిశీలించిన మూడో అంపైర్.. గుణతిలకను ఔట్‌గా ప్రకటించాడు.

అలా ఎలా ఔట్ ఇస్తారు?
అయితే ఆ వీడియోలో గుణతిలక కావాలని అడ్డువచ్చినట్లు లేదనే విషయం స్పష్టంగా కనిపించింది. దాంతో నెటిజెన్లు ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని అంపైర్ల తీరుపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే హర్భజన్ సింగ్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఐసీసీకి ఓ ట్వీట్ చేశాడు. ఓ క్రీడా ఛానెల్ పంచుకున్న వీడియోకు ఐసీసీని ట్యాగ్‌చేసి 'అలా ఎలా ఔట్ ఇస్తారు?' అని ప్రశ్నించాడు. హర్భజన్ మాత్రమే కాదు టామ్ మూడీ, మైఖేల్ వాన్, రస్సెల్ ఆర్నాల్డ్ కూడా ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

షై హోప్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టుకు ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (65; 90 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ (110; 133 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభం ఇచ్చారు. చివర్లో బ్రావో( 37; 47 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 47 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 8 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది.
టీమిండియా పంత్‌ను వదిలేసింది.. మీరు కూడా వదిలేస్తారా?! రోహిత్ శర్మ సూటి ప్రశ్న!


Click it and Unblock the Notifications












