PSL 2021 విజేత ముల్తాన్ సుల్తాన్స్.. ప్రైజ్‌మనీ ఐపీఎల్ కన్నా ఎంత తక్కువనో తెలుసా?

దుబాయ్: కరోనా అడ్డంకులను దాటుకొని ఎట్టకేలకు పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) 2021 విజయవంతంగా ముగిసింది. గురువారం రాత్రి జరిగిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్ 47 పరుగులతో పెషావర్ జాల్మీ జట్టును ఓడించి తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. కరోనా కారణంగా ఈ ఏడాది ప్రారంభమైన పీఎస్‌ఎల్ మధ్యలోనే నిలిచిపోయింది.
పలువురు ఆటగాళ్లు కరోనా బారినడపడటంతో నిర్వాహకులు టోర్నీ అర్దంతరంగా వాయిదా వేసారు. పరిస్థితులు మెరుగైన తర్వాత మిగిలిన మ్యాచ్‌ల్ని యూఏఈ వేదికగా నిర్వహించారు. ఈ క్రమంలో ఫస్టాఫ్ పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న ముల్తాన్ సుల్తాన్స్.. సెకండాఫ్‌లో దుమ్మురేపింది. ఒక్కో జట్టును ఓడిస్తూ మొత్తం 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి టోర్నీ చరిత్రలోనే తొలి టైటిల్‌ను గెలుచుకుంది.

మెరిసిన తాహీర్, మక్సూద్..
మెగాఫైనల్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. సోయబ్ మక్సూద్(65 నాటౌట్), రిలీ రోసోవ్ (50) హాఫ్ సెంచరీలతో రాణించారు. పెషావర్ జాల్మీ బౌలర్లలో సమీన్ గుల్, మహమ్మద్ ఇమ్రాన్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం పెషావర్ జాల్మీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. షోయబ్ మాలిక్(48), కమ్రాన్ అక్మల్(36) మినహా అంతా విఫలమయ్యారు. ఇమ్రాన్ తాహిర్(3/33) మూడు వికెట్లతో పెషావర్ పతనాన్ని శాసించగా.. ఇమ్రాన్ ఖాన్, ముజరబాని రెండేసి వికెట్ల పడగొట్టారు. 65 పరుగులతో అజేయంగా నిలిచిన సోయబ్ మక్సూద్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

3.5 కోట్ల ప్రైజ్ మనీ..
తొలి పీఎస్‌ఎల్ టైటిల్ అందుకున్న ముల్తాన్ సుల్తాన్స్ రూ. 3.5 కోట్ల ప్రైజ్‌మనీ అందుకుంది. అయితే ఐపీఎల్‌తో(IPL) పోలిస్తే పీఎస్‌ఎల్ విజేతకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంత? అని పరిశీలిస్తే చాలా తేడా ఉంది. దాదాపు ఐపీఎల్ క్యాష్ రివార్డులో మూడు రెట్లు తక్కువగా ఉంది. ఇక ఐపీఎల్లో 2019 సీజన్ వరకు విజేతకు రూ.20 కోట్లు, రన్నరప్‌కు రూ.12.5 కోట్లు ఇచ్చేవారు. కానీ కరోనా ప్రభావంతో ఖర్చుల తగ్గించుకున్న బీసీసీఐ.. గత సీజన్ నుంచి ప్రైజ్‌మనీలో సగం కోత విధించింది. టైటిల్ గెలిచిన జట్టుకు రూ.10 కోట్లు, ఫైనల్లో ఓడిన జట్టుకు రూ.6.25 కోట్లు అందజేస్తుంది.

పీఎస్‌ఎల్ X ఐపీఎల్ ప్రైజ్‌మనీ..
| కేటగిరి | పీఎస్‌ఎల్ 2021 | ఐపీఎల్ 2021 |
| విన్నర్ | రూ. 3.5 కోట్లు | రూ.10 కోట్లు |
| రన్నరప్ | రూ. 1.5 కోట్లు | రూ.6.25 కోట్లు |
| ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ | రూ.14.1 లక్షలు | రూ. 10 లక్షలు |
| టాప్ బ్యాట్స్‌మన్ | రూ. 3.75 లక్షలు | రూ. 10 లక్షలు |
| టాప్ బౌలర్ | రూ. 3.75 లక్షలు | రూ. 10 లక్షలు |

సెప్టెంబర్‌లో ఐపీఎల్
ఇక పీఎస్‌ఎల్ 2021 సీజన్‌లానే ఐపీఎల్ 2021 సీజన్ కూడా కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదాపడింది. ఏప్రిల్-మేలో ఐపీఎల్ జరుగుతున్న సమయంలో పలువురు ఆటగాళ్లకు కొవిడ్ పాజిటివ్‌గా తేలిన కారణంగా సీజన్ మధ్యలోనే నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ సమయాత్తం అవుతుంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన భారత క్రికెట్ బోర్డు.. షెడ్యూల్‌పై కసరత్తులు చేస్తుంది. సెప్టెంబర్ 14న ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ముగిసిన వెంటనే.. టీమిండియా ఆటగాళ్లు యూఏఈకి రానున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications