న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Test Championship: ఐదు గెలిస్తేనే ఫైనల్ రేసులో కోహ్లీసేన!

How Team India can stay in contention for World Test Championship final?

దుబాయ్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీ) ఫైనల్ రేస్‌లో భారత జట్టు ఉండాలంటే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌ల్లో ఖచ్చితంగా రాణించాల్సిందే. ప్రస్తుతం 114 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న భారత జట్టు.. ఆసీస్, ఇంగ్లండ్‌తో జరిగే ఎనిమిది టెస్ట్‌ల్లో కనీసం ఐదింటిలో గెలవాలి.

లేదంటే నాలుగింటిలో నెగ్గినా, మూడు మ్యాచ్‌లు డ్రా చేసుకోవాలి. అప్పుడే టైటిల్ రేసుకు అర్హత సాధిస్తుంది. ఇక టాప్-2లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా(116.46), న్యూజిలాండ్(116.37) మధ్య కూడా పోటీ రసవత్తరంగా సాగుతున్నది. ఇప్పటికే వెస్టిండీస్‌తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన కీవిస్.. ఈ నెల 26 నుంచి పాకిస్థాన్‌తో జరిగే సిరీస్‌ను 2-0తో గెలిస్తే అగ్రస్థానానికి చేరుకుంటుంది. అప్పుడు న్యూజిలాండ్ ఖాతాలో 420 పాయింట్లు ఉంటాయి. ఆసీస్ రెండో స్థానానికి పడిపోతుంది. భారత్‌తో సిరీస్‌ను బట్టి కంగారూల భవిష్యత్తు తేలిపోనుంది. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్ సిరీస్‌లపై వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ రేస్ ఆధారపడి ఉంటుంది.

ఆసీస్ టాప్‌లో ఉంటుందా.. కివీస్‌కు చోటు ఇస్తుందా? తేలాలి. భారత్, ఇంగ్లండ్, సిరీస్‌తో పూర్తి ఫలితం వస్తుంది.'అని ఐసీసీ పేర్కొంది. కరోనా దెబ్బకు పాయింట్ల సిస్టమ్‌కు బదులుగా పాయింట్ పర్సెంటేజ్‌ను బట్టి ఫైనల్-2 టీమ్‌లను తేల్చనున్నారు.

Story first published: Thursday, December 17, 2020, 11:01 [IST]
Other articles published on Dec 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X