Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: 7 మ్యాచ్‌ల్లో 5 ఓటమి.. SRH ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏంటంటే..?

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఆరెంజ్ ఆర్మీ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐదో ఓటమి. హాట్ ఫేవరేట్‌గా.. డిఫెండింగ్ రన్నరప్‌గా ఈ సీజన్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్..పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది.

రాజస్థాన్ రాయల్స్‌‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 286 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసి భారీ విజయంతో ఈ సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘోర పరాజయాలను చవిచూసింది. పంజాబ్ కింగ్స్‌తో 246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆరెంజ్ ఆర్మీ.. అంతలోనే మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. స్లోయర్ వికెట్‌పై ముంబై బౌలర్ల ముందు తేలిపోయింది. సగం సీజన్ ముగిసే సరికి 7 మ్యాచ్‌లు ఆడి 5 పరాజయాలతో పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో కొనసాగుతోంది.

How SRH Can Qualify For the IPL 2025 Playoffs Despite 5th Defeat

చెత్త బ్యాటింగ్..
బ్యాటింగ్ వైఫల్యమే ఈ ఐదు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిని శాసించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్‌ల ఘోర వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయవకాశాలను దెబ్బతీస్తోంది. పరిస్థితులతో సంబంధం లేకుండా బ్యాట్‌ను ఊపుతూ సన్‌రైజర్స్ బ్యాటర్లు మూల్యం చెల్లించుకుంటున్నారు. జట్టులో ఒక్క స్ట్రోక్ మేకింగ్ బ్యాటర్ లేకపోవడం గమనార్హం.

పేలవ బ్యాటింగ్‌కు తోడు చెత్త బౌలింగ్‌ జట్టుకు తీవ్ర నష్టం చేస్తోంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం.. అనుభవం కలిగిన మహమ్మద్ షమీ తేలిపోతుండటం.. సిమర్జిత్ సింగ్, ఉనాద్కత్, ఇషాన్ మలింగా వంటి బౌలర్ల‌పై నమ్మకం ఉంచే పరిస్థితి లేకపోవడం సన్‌రైజర్స విజయవకాశాలను దెబ్బతీస్తోంది. స్లోయర్ వికెట్‌పై సన్‌రైజర్స్ తీవ్రంగా తడబడుతుంది. దాంతో తదుపరి మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్లన్నీ స్లో వికెట్‌ను తయారు చేసే అవకాశం ఉంది.

ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇంకా 7 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఎలాంటి సమీకరణంతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ చేరాలంటే సన్‌రైజర్స్ ఏడింటికి 7 గెలవాలి. అప్పుడే 9 విజయాలు 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది. ఈ 7 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ ఓడినా.. ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. సన్‌రైజర్స్ నెట్ రన్‌రేట్ కూడా దారుణంగా ఉంది. కాబట్టి తదుపరి 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించడమే కాకుండా నెట్ రన్‌రేట్ కూడా మెరుగుపర్చుకోవాలి. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడితే మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తోంది.

Story first published: Friday, April 18, 2025, 8:17 [IST]
Other articles published on Apr 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+