అప్పుల బాధతో జైలుకు వెళ్లిన తండ్రి.. రోహిత్ కోచ్ సలహాతో స్టార్‌గా మారిన కొడుకు!
'ముకుల్ చౌదరి’.. ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో మారుమోగుతున్న పేరు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ లక్నో సూపర్ జెయింట్స్ యువ కెరటం అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారాడు. తన ఆరాధ్య క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తరహాలో ఏడు భారీ సిక్స్‌లతో అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేశాడు. ముఖ్యంగా ధోనీ ట్రేడ్ మార్క్ హెలీక్యాప్టర్ షాట్‌తో ఆకుట్టుకున్నాడు.
128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన లక్నో జట్టును.. ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన ముకుల్ చౌదరి(27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో గెలిపించాడు. వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, కామెరాన్ గ్రీన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా డీప్ కవర్ మీదుగా అతను బాదిన సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
ముకుల్ చౌదరి వెనుక రోహిత్ చిన్ననాటి కోచ్..
అయితే ముకుల్ చౌదరి సక్సెస్ వెనుక టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ ఉన్నారు. ఐపీఎల్‌కు ముందు ముకుల్ చౌదరి ఫామ్ కోల్పోయి రాజస్థాన్ రంజీ జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. దాంతో తన బ్యాటింగ్ లోపాలను సవరించుకునేందుకు ముకుల్ చౌదరి దినేష్ లాడ్‌ను ఆశ్రయించారు. ఈ విషయాన్ని ముకుల్ చౌదరే గతంలో మైఖేల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ముకుల్ బ్యాటింగ్‌లో దినేష్ లాడ్ స్వల్ప మార్పులు చేశాడు. బ్యాట్ గ్రిప్ విషయంలో చిన్న మార్పు చేయడంతో పాటు స్ట్రైట్ గ్రౌండ్ ఆడాలని సలహా ఇచ్చాడు. ఈ విషయాన్ని తాజాగా మైఖేల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దినేష్ లాడ్ ధృవీకరించారు. అంతేకాకుండా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌కు రెండు రోజుల ముందు ఫోన్ ద్వారా ముకుల్ చౌదరితో మాట్లాడానని, వికెట్ ముందు వైపు ఆడాలని సూచించానని తెలిపాడు. అంతేకాకుండా ఫ్యాన్సీ షాట్స్ కాకుండా సరైన క్రికెట్ షాట్స్ ఎంచుకోవాలని సూచించానని వెల్లడించాడు.
మ్యాచ్‌కు ముందే ఫోన్ చేశా..
'గత సోమవారమే ముకుల్ చౌదరితో ఫోన్ కాల్ మాట్లాడాను. వికెట్ వెనుక షాట్స్ ఆడకుండా వికెట్ ముందువైపు ఆడాలని సూచించాను. అలాగే ఫ్యాన్సీ షాట్స్ కాకుండా సరైన క్రికెటింగ్ షాట్స్ ఆడటంపై ఫోకస్ పెట్టాడు. అది ఫలించింది. ’అని దినేష్ లాడ్ పేర్కొన్నాడు.
కన్నీళ్లు పెట్టించే గతం.. తండ్రికి రూ. 3.5 కోట్ల అప్పు..
ముకుల్ చౌదరి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో ఏళ్ల కష్టం, తండ్రి పడ్డ వేదన ఉంది. రాజస్థాన్‌లోని జుంజు జిల్లాకు చెందిన ముకుల్ తండ్రి దలిప్ కుమార్ చౌదరి.. తన కొడుకును క్రికెటర్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పెళ్లికాక ముందు నుంచే అతను కలలు కన్నారు. కొడుకు శిక్షణ కోసం తమ సొంత ఇంటిని కూడా అమ్మేశారు. అయితే వ్యాపారాల్లో నష్టాలు రావడంతో అతనికి దాదాపు రూ.3.5 కోట్ల రూపాయాల అప్పు అయ్యింది. అప్పుల బాధతో చివరకు ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications