Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా కల నెరవేరింది.. కోహ్లీ ట్వీట్‌పై నెట్‌ఫ్లిక్స్ సంబరం!

 How Netflix Responded To Virat Kohlis Tweet

న్యూఢిల్లీ: ఈ తరం క్రికెటర్లలో ఎక్కువ ప్రజాదరణ కలిగిన ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అతనికి అభిమానులు ఉన్నారు. అతన్ని ఒక్కసారైన కలవాలని, కుదిరితే కలిసి ఫొటోలు దిగాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలోనూ అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ కూడా తాము కూడా కోహ్లీ అభిమానేని తెలిపింది. విరాట్‌తో కలిసి ఫొటో దిగాలనుకున్న తమ కల నెరవేరిందని తాజాగా ట్వీట్‌ చేసింది.


అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం సిడ్నీలో ఉన్న కోహ్లీ క్వారంటైన్‌ నిబంధనలు పాటిస్తూ ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతున్నాడు. క్వారంటైన్‌ను ఆస్వాదిస్తున్నానని, సౌకర్యవంతమైన మంచం, చూడటానికి మంచి వెబ్‌సిరీస్‌లు ఉన్నాయని పేర్కొంటూ కోహ్లీ తన సెల్ఫీని మంగళవారం ట్వీట్ చేశాడు. అయితే ఫొటోలో ఉన్న ల్యాప్‌టాప్‌లో నెట్‌ఫ్లిక్స్‌లోని వెబ్‌సిరీస్‌లు కనిపించాయి. దీంతో కోహ్లీ ట్వీట్‌ను నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా రీట్వీట్ చేస్తూ పోస్ట్ చేసింది. ''ఆ కంప్యూటర్‌ స్క్రీన్‌పై మేం ఉన్నాం. విరాట్ కోహ్లీతో కలిసి ఫొటో దిగాలనుకున్న మా కల నెరవేరింది' అని ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Story first published: Wednesday, November 18, 2020, 15:10 [IST]
Other articles published on Nov 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+