IPL 2025 విజేత ప్రైజ్‌మనీ ఎంతంటే?
ఐపీఎల్ 2025 సీజన్ తుది దశకు చేరుకుంది. మరికొద్ది క్షణాల్లో ప్రారంభమయ్యే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ రెండు జట్లు ఫైనల్ రావడంతో ఐపీఎల్‌లో కొత్త ఛాంపియన్ అవతరించబోతుంది. ఆర్‌సీబీకి ఇది నాలుగో ఫైనల్ కాగా.. పంజాబ్ కింగ్స్‌కు రెండోది. గతంలో ఆర్‌సీబీ 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్ చేరి తృటిలో టైటిల్ కోల్పోయింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ 2014లో ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓటమిపాలైంది.
18 ఏళ్లుగా ఆర్‌సీబీకి ఆడుతున్న విరాట్ కోహ్లీ టైటిల్ అందుకోవాలని ఆ జట్టు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గతేడాది కేకేఆర్ కెప్టెన్‌గా ఆ జట్టుకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్.. ఈ సారి పంజాబ్ కింగ్స్‌ను విజేతగా నిలబెట్టాలనే కసితో ఉన్నాడు. అయితే ఐపీఎల్ 2025లో ఛాంపియన్‌గా నిలిచే జట్టుకు రూ. 20 కోట్లు, రన్నరప్‌కు రూ. 13 కోట్ల ప్రైజ్‌మనీని బీసీసీఐ అందజేయనుంది.

క్వాలిఫయర్-2లో ఓడిన ముంబై ఇండియన్స్‌కు రూ. 7 కోట్లు, ఎలిమినేటర్‌లో ఓడిన గుజరాత్ టైటాన్స్‌కు రూ. 6.5 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ప్లేయర్లకు పది లక్షల చొప్పున నగదు పురస్కారం లభించనుంది. ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, అత్యధిక స్ట్రైక్‌రేట్, అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్లకు కూడా రూ. 10 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ దక్కుతుంది. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి బీసీసీఐ ప్రైజ్‌మనీ అమౌంట్‌ను మార్చలేదు.
ఐపీఎల్ ప్రైజ్‌మనీ వివరాలు..
- విజేత: రూ. 20 కోట్లు
- రన్నరప్ : రూ.13 కోట్లు
- క్వాలిఫైయర్- 2లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్‌కు రూ.7 కోట్లు
- ఎలిమినేటర్‌లో ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్‌కు రూ. 6.5 కోట్లు
వ్యక్తిగత అవార్డుల విజేతల ప్రైజ్‌మనీ
- ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు): ₹10 లక్షలు
- పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు): ₹10 లక్షలు
- ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: ₹10 లక్షలు
- మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్: ₹10 లక్షలు
- సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: ₹10 లక్షలు
- అత్యధిక సిక్స్‌లు: ₹10 లక్షలు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications