For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2026: పాకిస్థాన్‌కు దక్కే ప్రైజ్‌మనీ ఎంతంటే..?

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో పాకిస్థాన్ పోరాటం ముగిసింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ.. మెరుగైన రన్‌రేట్ లేని కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన తమ ఆఖరి సూపర్-8 పోరులో శ్రీలంకను 147 పరుగులకు కట్టడి చేయలేక రన్‌రేట్(-0.123)లో వెనుకబడిన పాకిస్థాన్ ఇంటిముఖం పట్టింది. పాకిస్థాన్ మాదిరే 3 మ్యాచ్‌ల్లో 3 పాయింట్లే సాధించినా.. మెరుగైన రన్‌రేట్‌తో న్యూజిలాండ్(1.390) సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు షాహిబ్జాదా ఫర్హాన్(60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100), ఫకార్ జమాన్(42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84) విధ్వసంకర బ్యాటింగ్‌తో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

How Much Prize Money Will Pakistan Get After Exit From ICC T20 World Cup 2026 Super 8 Stage

అనంతరం శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఓ దశలో శ్రీలంక 147 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ డసన్ షనకతో(76 నాటౌట్) పవన్ రత్నాయకే(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. షాహీన్ అఫ్రిది వేసిన ఆఖరి ఓవర్‌లో షనక.. 4, 6, 6, 6 బాది గెలిపించినంత పనిచేశాడు. కానీ ఆఖరి బంతిని షాహీన్ అఫ్రిది వైడ్ యార్కర్‌గా సంధించగా.. అంపైర్ వైడ్ ఇవ్వలేదు. రూల్స్ ప్రకారం ఈ బంతి వైడ్. దాంతో శ్రీలంక ఓటమిపాలైంది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ నుంచి తప్పుకున్నా పాకిస్థాన్‌కు ప్రైజ్‌మనీ దక్కనుంది. పాకిస్థాన్‌తో పాటు ఈ టోర్నీ ఆడిన 20 జట్లకు ప్రైజ్‌మనీ దక్కుతుంది. అయితే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి సంబంధించిన ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ గత ఎడిషన్ కంటే ఈ సారి ప్రైజ్‌మనీ 20 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గత ఎడిషన్ ప్రకారం సెమీఫైనల్లో ఓడిన ఒక్కో జట్టుకు సుమారు ₹6.5 కోట్లు లభించాయి. ఈ సారి రూ.7.2 కోట్ల దక్కే ఛాన్స్ ఉంది. 13 నుంచి 20 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.2- 2.3 కోట్ల దక్కనుంది. సూపర్-8 చేరిన జట్లకు వారి స్థానాలను బట్టి రూ.3.1 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల దక్కనుంది. సెమీఫైనల్, ఫైనల్ మినహాయించి గ్రూప్ దశలో సాధించిన ప్రతీ విజయానికి గానూ ఒక్కో జట్టుకు సుమారు రూ.25-30 లక్షల చొప్పున ఐసీసీ అదనంగా అందజేయనుంది. విజేతగా నిలిచే జట్టుకు రూ.25 కోట్లు నుంచి రూ.27 కోట్ల ప్రైజ్ మనీ అందుకోనుండగా.. రన్నరప్‌కు రూ.13.3 కోట్ల నుంచి రూ.14.6 కోట్ల దక్కనుంది.

ఈ లెక్కన పాకిస్థాన్‌కు రూ.3.1 కోట్ల నుంచి రూ.3.5 కోట్లతో పాటు లీగ్ దశ, సూపర్ -దశల్లో సాధించిన ప్రతీ విజయానికి అదనంగా ఒక కోటీ 13 లక్షలు 50 వేలు లభించనుంది. ఈ టోర్నీలో పాకిస్థాన్ లీగ్ దశలో మూడు విజయాలు సాధించగా.. సూపర్-8లో ఒక విజయంతో పాటు మరో మ్యాచ్‌ రద్దయిన సంగతి తెలిసిందే.

Story first published: Sunday, March 1, 2026, 18:24 [IST]
Other articles published on Mar 1, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+