
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. టీమిండియా రెండు వరల్డ్ కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్ కూడా ధోనియే. ముఖ్యంగా చివర్లో ధోని మ్యాచ్‌ను ముగించే తీరు అద్భుతం.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
2011 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సిక్స్‌తో మ్యాచ్‌ని ముగించిన తీరు అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇప్పటి వరకు ధోని అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో ఎన్నిసార్లు సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ధోని ఇప్పటివరకు తన కెరీర్‌లో ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన లక్ష్య ఛేదనలో 21 సార్లు సిక్స్ బాది విజయవంతంగా మ్యాచ్‌ను ఫినిష్ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఏ ఫార్మాట్లో ఎన్నెన్ని సార్లు అంటే:
* అంతర్జాతీయ వన్డేలు- 9 సార్లు
* ఐపీఎల్- 4 సార్లు
* అంతర్జాతీయ టీ20లు- 3 సార్లు
* ఛాంపియన్స్ లీగ్ టీ20 -2 సార్లు
* దేశవాళీ లిస్ట్-ఏ మ్యాచ్‌లు- 2 సార్లు
* టెస్టు క్రికెట్- ఒక్కసారి