For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌లో గరిష్టంగా ఎన్ని పరుగులు పరుగెత్తవచ్చు?

అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాటర్లు గరిష్టంగా 3 పరుగులు పరుగెత్తడం తరుచూ చూస్తుంటాం. కొన్నిసార్లు ఓవర్‌ త్రోల వల్ల, ఫీల్డర్ల తప్పిదాల వల్ల బ్యాటర్లు 4 పరుగులు కూడా పరుగెత్తారు. అయితే క్రికెట్‌లో గరిష్టంగా ఎన్ని పరుగులు పరుగెత్తవచ్చు? అంటే చాలా మంది తడబడుతారు. అలా పరుగెత్తే అవకాశం కూడా ఎక్కవ రాదు. దాంతో ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోరు. కానీ రన్స్ తీసే విషయంలో క్రికెట్ రూల్స్ ఏంటి? క్రికెట్ చరిత్రలో గరిష్టంగా ఎన్ని పరుగులు తీసారనే విషయాన్ని తెలుసుకుందాం.

రూల్ ఏంటంటే..?

క్రికెట్ రూల్స్ ప్రకారం.. బంతి ఇన్ ప్లేలో ఉన్నంత వరకు బ్యాటర్లు వికెట్ల మధ్య ఎన్నిసార్లైనా పరుగెత్తవచ్చు. ఫీల్డింగ్ జట్టు బంతిని తిరిగి బౌలర్ లేదా వికెట్ కీపర్‌కు అందించే వరకు రన్స్ లెక్కించబడతాయి. గరిష్టంగా ఇన్ని పరుగులే అనే రూల్ ఏం లేదు. సాధ్యమైతే 100 పరుగులు కూడా పరుగెత్తవచ్చు. అయితే ఆచరణలో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఫీల్డర్స్ చాలా చురుకుగా ఉంటారు. బంతిని వికెట్ కీపర్ లేదా బౌలర్‌కు అందజేస్తారు. అంతేకాకుండా బంతి బౌండరీ ధాటితే ఫోర్‌గా లెక్కిస్తారు. గాల్లో నుంచి బౌండరీ బయట పడితే సిక్సర్‌గా పరిగణిస్తారు. కాబట్టి ఎక్కువ పరుగులు తీసే అవకాశం ఉండదు. 1,2,3 పరుగులు పరుగెత్తడం సర్వసాధారణం. ఫీల్డర్ తప్పిదాలు, ఓవర్‌ త్రో కారణంగా అప్పుడప్పుడు 4 పరుగులు తీసిన ఘటనలు ఉన్నాయి. కొన్ని సార్లు 5, 6 పరుగులు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

How Many Runs Can Be Run on One Ball in Cricket

286 పరుగులు పరుగెత్తారు..

1894లో విక్టోరియా వర్సెస్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో 286 పరుగులు పరుగెత్తారంట. క్రికెట్ చరిత్రలోనే ఇది చర్చనీయాంశమైన సంఘటన. ఈ మ్యాచ్‌లో బ్యాటర్ బంతిని కొట్టగా అది ఒక చెట్టులో ఇరుక్కు పోయిందట. బంతి కనిపించినప్పటికీ.. తీసేందుకు వీలు కాకపోవడంతో ఫీల్డింగ్ టీమ్ బంతి కోల్పోయినట్లు ప్రకటించాలి అంపై‌ర్‌ను కోరిందట. కానీ అంపైర్ అంగీకరించకపోవడంతో బంతిని తెచ్చేలోపు బ్యాటర్లు 286 పరుగులు తీసారంట. అయితే ఈ ఘటనకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. అయితే ఇదంతా ఓ కట్టు కథ అని, అప్పటి వార్త పత్రికలు కొట్టిపారేసాయి. ఆచరణలో, 22 గజాల పిచ్‌పై 286 పరుగులు పరుగెత్తడం అనేది దాదాపు 6 కిలోమీటర్లు పరిగెత్తినట్లు అవుతుంది. ఇది శారీరకంగా అసాధ్యం.

8 పరుగులు తీసిన సైమండ్స్..

టెస్ట్ క్రికెట్‌లో, ఒక బంతికి 8 పరుగులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇవి కేవలం పరుగు తీయడం ద్వారానే కాకుండా ఓవర్ త్రో రూపంలో లభించిన బౌండరీలతో వచ్చినవి. 2008లో ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ 8 పరుగులు తీసాడు. ముందుగా 4 పరుగులు పరుగెత్తిన అతనికి ఓవర్ త్రో ద్వారా బౌండరీ లభించింది.

ఒక బంతికి 8 పరుగులు తీసిన బ్యాటర్లు

929లో పాట్సీ హెండ్రెన్ (ఇంగ్లండ్)
1980లో జాన్ రైట్ (న్యూజిలాండ్)
2008లో ఆండ్రూ సైమండ్స్ (ఆస్ట్రేలియా)

Story first published: Tuesday, June 10, 2025, 10:50 [IST]
Other articles published on Jun 10, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+