తిట్టిన నోళ్లే శభాష్ అంటున్నాయి.. ఒక్క సెంచరీతో రోహిత్ శర్మకే ఎసరు పెట్టిన రిషభ్ పంత్!

హైదరాబాద్: ప్రతిభకు కొదవలేదు. కానీ ఓపిక లేదు. ఖతర్నాక్ షాట్లు కొట్టగలడు. పరిస్థితులను పట్టించుకోడు. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడు. కానీ గుడ్డిగా నమ్మలేం. ధోనీ వారసుడిగా టీమిండియాలోకి వచ్చిన రిషభ్ పంత్ గురించి ఇన్నాళ్లూ విమర్శకులకు ఉన్న అభిప్రాయాలివి. పంత్ ప్రతిభను పొగిడేవాళ్లంతా.. కానీ అంటూ ఏదో బలహీనత ఉందనేవారు. అయితే ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో తనలో ఏ చిన్న బలహీనతా లేదని రిషభ్ పంత్ నిరూపించాడు. టాపార్డర్ బ్యాటర్లంతా విఫమైన వేళ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. వాస్తవానికి రిషభ్ బ్యాటింగ్‌లో ముందు నుంచి ఎలాంటి బలహీనత లేదు. అతనిలో లోపించింది ఓపిక, ప్రశాంతతే. అనుభవం గడిస్తున్న కొద్దీ ఈ రెండు విషయాల్లో మెరుగయ్యాడు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఆడటం అలవాటు చేసుకొని ఇప్పుడు 'పర్ఫెక్ట్ పంత్'లా కనిపిస్తున్నాడు.

ఎక్కడైతే విఫలమయ్యాడో అక్కడే..
మూడేళ్ల కిందట ఇదే మాంచెస్టర్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో నిర్లక్ష్యమైన షాట్ ఆడి విమర్శలు ఎదుర్కొన్న పంత్ ఇప్పుడు అందరి చేతా శభాష్ అనిపించుకున్నాడు. నాడు క్రీజులో కుదురుకున్న తర్వాత మిచెల్ సాంట్నర్ బాల్‌ను స్లాగ్ స్వీప్ షాట్ ఆడి డీప్ మిడ్ వికెట్‌లో క్యాచ్ ఇచ్చిన పంత్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. నిర్లక్ష్యపు షాట్‌తో టీమిండియా ఓటమికి కారణమయ్యాడని జనాలంతా తిట్టిపోసారు.
అతను నిర్భయమైన క్రికెటర్.. కాదు నిర్లక్ష్యమైన క్రికెటర్ అంటూ ట్రోల్ చేశారు. అయితే ఆ విమర్శలను ఏ మాత్రం పట్టించుకోని పంత్.. తన ఆటపై మాత్రమే ఫోకస్ పెట్టాడు.

బాధ్యత మరవలేదు..
19 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన రిషభ్ పంత్ తన బాధ్యతలను ఎప్పుడూ విస్మరించలేదు. అప్పటికి ధోనీ వారసుడిగా టీమిండియా తదుపరి కీపర్‌కు తీవ్ర పోటీ నెలకొనగా.. అందరినీ దాటుకుంటూ జట్టులోకి వచ్చాడు. కరోనా టైమ్‌లో ఆటకు బ్రేక్ వచ్చిన టైమ్‌లోనూ సురేశ్ రైనా వంటి సీనియర్ క్రికెటర్లతో కలిసి రిథమ్ కోల్పోకుండా జాగ్రత్తపడ్డాడు. రైనా సొంత మైదానంలో తీవ్రంగా చెమటోడ్చాడు.

రికీ పాంటింగ్, ద్రవిడ్ ప్రభావం
పంత్ కెరీర్లో రికీ పాంటింగ్, రాహుల్ ద్రవిడ్ ప్రభావం చాలా ఉంది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ అయిన పాంటింగ్ గైడెన్స్‌లో పంత్ తన ఆలోచన తీరు మార్చుకున్నాడు. అలాగే, అండర్19 నుంచి ద్రవిడ్‌తో పంత్‌కు మంచి అనుబంధం ఉంది. జట్టులో పంత్‌ను సౌకర్యవంతంగా ఉంచితే ఫలితం వస్తుందని ద్రవిడ్‌కు తెలుసు. అందుకే మొన్నటి సౌతాఫ్రికా సిరీస్‌లో పూర్తిగా ఫెయిలైనా కూడా రిషభ్‌కు ద్రవిడ్ అండగా నిలిచాడు. అతని ప్రతిభపై నమ్మకం ఉంచాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుతో పాటు ఆఖరి వన్డేలో అద్భుత సెంచరీలతో పంత్ కోచ్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో నిలకడగా ఆడుతున్న రిషభ్‌కు మంచి ఫ్యూచర్ ఉంది. అతని వయసు 24 ఏళ్లే. ఇదే జోరు కొనసాగిస్తే అందర్నీ పక్కకు నెట్టి రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్‌గా టీమిండియాను నడిపించే అవకాశాలూ ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications