Tri Series: శ్రీలంక-ఏ చేతిలో పరాజయం.. భారత్-ఏ ఫైనల్ చేరాలంటే..?
శ్రీలంక గడ్డపై జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. సోమవారం దంబుల్లా వేదికగా ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక-ఏ సూపర్ ఓవర్‌లో భారత్-ఏను ఓడించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటవ్వగా.. శ్రీలంక-ఏ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులే చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. దాంతో అంపైర్లు సూపర్ ఓవర్‌తో మ్యాచ్ ఫలితాన్ని తేల్చారు. సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఏ 16 పరుగులు చేయగా.. భారత్-ఏ 10 పరుగులే చేసి ఓటమిపాలైంది.
ఫైనల్ చేరాలంటే..?
ఈ ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌కు ఇది రెండో పరాజయం. అఫ్గానిస్థాన్-ఏతో మ్యాచ్‌లో భారత్-ఏ అనూహ్యంగా ఓటమిపాలైంది. వర్షం అంతరాయం కలిగించిన ఆ మ్యాచ్‌లో డకవర్త్ లూయిస్ పద్దతి భారత్ ఓటమిని శాసించింది.
వరుసగా రెండు పరాజయాలతో తిలక్ వర్మ సారథ్యంలోని భారత్-ఏ జట్టుకు ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ సిరీస్‌లో భారత్ ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. అఫ్గానిస్థాన్-ఏ బుధవారం చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్‌లో భారత్-ఏ ఫైనల్ చేరాలంటే.. అఫ్గానిస్థాన్-ఏపై ఘన విజయం సాధించాలి. అప్పుడే నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు మెరుగైన రన్‌రేట్‌తో భారత్-ఏ ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది.

ఓడితే ఇంటికే..
ఈ ముక్కోణపు వన్డే సిరీస్‌లో మూడు జట్లు రెండేసి సార్లు తలపడనున్నాయి. ఆ తర్వాత టాప్-2లో నిలిచిన టీమ్స్ నేరుగా ఫైనల్ ఆడుతాయి. ప్రస్తుతానికి 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో శ్రీలంక -ఏ అగ్రస్థానంలో ఉంది. భారత్-ఏ మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి మరొకటి ఓడిన అఫ్గానిస్థాన్-ఏ మూడో స్థానంలో ఉంది.
బుధవారం అఫ్గాన్-ఏతో జరిగే మ్యాచ్‌లో భారత్-ఏ గెలిస్తే సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడితే మాత్రం ఈ సిరీస్ నుంచి నిష్క్రమిస్తోంది. గెలిస్తే.. అఫ్గానిస్థాన్, శ్రీలంకతో శుక్రవారం జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిస్తే భారత్ ఫైనల్ చేరుతోంది. ఓడితే మాత్రం మూడు జట్లలో మెరుగైన రన్‌రేట్ ఉన్న టీమ్స్ ఫైనల్ చేరుతాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

